close
గుస‌గుస‌లు
‘క్రిష్‌-4’ విడుదల అప్పుడేనా..?

ముంబయి: 2006లో విడుదలైన ‘క్రిష్‌’ చిత్రం బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమాని ఆయన తండ్రి రాకేశ్‌ రోషన్‌ తెరకెక్కించారు. ఆ తర్వాత హృతిక్‌ ‘క్రిష్‌’ సినిమానికి సీక్వెల్స్‌గా తెరకెక్కించిన ‘క్రిష్‌-2’, ‘క్రిష్‌-3’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.  హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా ఆయన తండ్రి రాకేశ్‌ రోషన్‌ ‘క్రిష్‌-4’ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు గతేడాది ప్రకటించారు. ఈ క్రమంలో రాకేశ్‌ రోషన్‌ క్యాన్సర్‌ బారిన పడడంతో ఈ సినిమాని కొన్నిరోజుల పాటు వాయిదా వేశారు. తాజాగా రాకేశ్‌ రోషన్‌ క్యాన్సర్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఈ సినిమాని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు హృతిక్‌ ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. ‘క్రిష్‌-4’ సినిమాని రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వచ్చే ఏడాది క్రిస్మస్‌కు ఈ సినిమాని విడుదల చేయవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.