close
గుస‌గుస‌లు
మరోసారి తమన్నాను ఎంచుకున్న దర్శకుడు?

హైదరాబాద్‌: కథానాయకుడు గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు యూనిట్‌ ఇటీవల ప్రకటించింది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమా మాటలు, కథ, స్క్రీప్లై బాధ్యతలు కూడా సంపత్ చూసుకుంటున్నారు.

కాగా ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం సంపత్ మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండూ మంచి టాక్‌ అందుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రంలోని పాత్రకు కూడా ఆమెనే ఎంచుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఇంకా చిత్ర బృందం స్పందించలేదు. గోపీచంద్‌-సంపత్ కాంబినేషన్‌లో ‘గౌతమ్‌ నంద’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.