close
అవీ.. ఇవీ..
పెళ్లి చేసుకుంటావా? అని అమ్మాయినిఅడిగి..

మిక్కీ కెరీర్‌.. సూపర్‌ హిట్టు..!

మిక్కీ జె. మేయర్‌.. ఆయన స్వరాలన్నీ ఎంతో ప్రశాంతంగా, తనువును తాకిన చల్లని గాలిలా ఉంటాయి. మెలోడీకి పెద్ద పీట వేస్తూ పాటల్ని రూపొందించడం ఆయన శైలి. ‘హ్యాపీడేస్‌’ నుంచి ఆయన సినీ ప్రయాణం అలానే సాగుతోంది. అటు తక్కువ బడ్జెట్‌తో సినిమాలతో పాటు ఇటు భారీ బడ్జెట్‌ చిత్రాల కోసం కూడా పనిచేస్తూ హిట్లు ఖాతాలో వేసుకుంటున్నారు. ఆయన బాణీలు అందించిన ‘ఓ బేబీ’, ‘గద్దలకొండ గణేష్‌’ ఇటీవల విశేష ఆదరణ అందుకున్నాయి. వీటిలోని పాటలు శ్రోతల్లో క్రేజ్‌ సంపాదించుకున్నాయి. ‘సూపర్‌ హిట్టు నీ హైటు, సూపర్‌హిట్టు నీ రూటు..’ ప్రత్యేక గీతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొంటున్నారు. మీడియాకు కాస్త దూరంగా ఉండే మిక్కీ గురించి కొన్ని విషయాలు చదివేద్దాం..

బోర్‌ కొట్టి..

మిక్కీ హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగారు. ఆయన తండ్రి బిజినెస్‌ చేసేవారు. ఐదో తరగతిలో పియానో నేర్చుకున్నారు. ఆయన తండ్రి ఉదయం వెళ్లేటప్పుడు తలక్‌ మహమూద్ పాటలు వినిపించేవారట. ఇంటికి వచ్చే సరికీ ఆ పాటను పియానో మీద వాయించాలని చెప్పేవారు. అలా రోజుకు రెండు పాటలు వాయించే వాడినని ఓ సారి మిక్కీ చెప్పారు. ఇక తన మనసంతా సంగీతంపై ఉండటం, చదువుపై ఆసక్తిలేకపోవడంతో ట్రినిటీ మ్యూజిక్‌ కాలేజీలో చేరారు. కొన్ని సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ‘పాఠశాల మీద బోర్‌ కొట్టి మ్యూజిక్‌లోకి వచ్చాను.. అక్కడ కూడా పాఠాలు చెబుతుంటే విసుగొచ్చింది’ అని చెబుతారు మిక్కీ. అందుకే కాలేజ్ మానేసి సొంతంగా మ్యూజిక్‌ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

తొలి అవకాశం

పై మిక్కీ ఐదారు ట్యూన్స్‌తో ఒక ఆల్బమ్‌ చేసి.. దర్శక, నిర్మాతల దగ్గరికి వెళ్లారు. దిల్‌రాజు, సురేష్‌బాబు.. ఇలా చాలా మంది దగ్గరికి వెళ్లారట. చివరికి తమ్మారెడ్డి భరద్వాజ ఆయనకు 2005లో ‘పోతే పోనీ’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా సంగీత దర్శకుడిగా ఆయన ప్రయాణం మొదలైంది.

బ్రేక్‌ వచ్చింది..

2007లో ‘హ్యాపీడేస్‌’ మిక్కీ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాకు గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్‌, సిని‘మా’ అవార్డు.. అంతేకాదు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఆయన జోరు పెరిగింది. ‘కొత్త బంగారు లోకం’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘చందమామ కథలు’, ‘కేరింత’, ‘అ..ఆ’, ‘శతమానంభవతి’ సినిమాలు మంచి విజయాలు అందుకోవడమే కాకుండా మ్యూజికల్‌గా మంచి అందరినీ మెప్పించాయి. ‘కొత్త బంగారు లోకం’, ‘అ..ఆ’ సినిమాలకు కూడా నంది అవార్డులు వరించాయి.

మహానటి ఓ ఎత్తు

లనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తీసిన సినిమా ‘మహానటి’. దీనికి స్వరాలు అందించడం అంత సులభమైన విషయం కాదు. సావిత్రి జీవితం ఇప్పటిది కాదు.. ఆ కాలానికి తగ్గట్టు సంగీతం కంపోజ్‌ చేయడం సవాలే. మిక్కీ ఆ ఛాలెంజ్‌ స్వీకరించారు. సమర్థంగా బాణీలను అందించడంలో విజయం సాధించారు. ఈ చిత్రం ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకుంది.

నెలకే పెళ్లి..

‘నా భార్య అమెరికన్‌. ఒకసారి పార్టీలో కలిశాం. నాకు తను తగిన అమ్మాయి అనిపించింది. తన దగ్గరకు వెళ్లి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగా. తను సరేనంది. నెల రోజుల తర్వాత పెళ్లి చేసుకున్నాం. అంతే తప్ప ప్రపోజల్స్‌, డేటింగ్‌.. ఇలాంటివి ఏమీ లేవు. నాకు ఇద్దరు పిల్లలు. సంగీతం నా వృత్తి.. నా వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మ్యూజిక్‌ గురించి మాట్లాడను. నా స్నేహితులకు కూడా ట్యూన్స్‌ వినిపించను. పొరపాటున కారులో ఏదైనా ట్యూన్‌ ప్లే అయితే.. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది’ అని మిక్కీ చెబుతారు

వారంటే ఇష్టం..

స్కార్‌ గ్రహీత ఎ.ఆర్‌. రెహమాన్‌ అంటే మిక్కీకి ఇష్టమట. గాయకుల్లో కార్తిక్‌, చిత్ర స్వరం నచ్చుతుందట. ‘నాకు తెలుగు రాదు. ఏదైనా పాట విని దానిలో ఉన్న సాహిత్యం మంచి చెడ్డలు చెప్పలేను. నేను ఈ రంగంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఇబ్బందిగా ఉండేది . కానీ, ఇప్పుడు మ్యూజిక్‌ ఈజ్‌ యూనివర్శల్‌ అనిపిస్తుంది. పాటల రచయిత, సంగీత దర్శకుడు క్రియేటివ్‌గా పనిచేస్తే తెలుగు రాకపోవడం ఓ అడ్డంకి కాదు’ అంటుంటారు ఆయన.

తొలిసారి ‘మాస్‌’ అదరగొట్టేశారు

మిక్కీ జే మేయర్‌ అంటే సాధారణ మెలోడీ, క్లాస్‌పాటలే గుర్తొస్తాయి. తొలి నుంచి ఆయన బాణీ అదే. అయితే తొలిసారి వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దల కొండ గణేష్‌’ కోసం ఆయన శైలిని పక్కన పెట్టారు. ‘ఎల్లువచ్చి గోదారమ్మా’ పాటను రీమిక్స్‌ చేయడంతో పాటు, ‘జర్రా.. జర్రా..’ ఐటమ్‌ సాంగ్‌తో యువతను ఓ ఊపు ఊపేస్తోంది. అంతేకాదు, నేపథ్య సంగీతంతో తన మార్కును చూపించారు. ‘గద్దలకొండ గణేష్‌’గా వరుణ్‌తేజ్‌ను ఎలివేట్‌ చేసే సన్నివేశాలు, ‘వక.. వక..’ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ థియేటర్‌లోని ప్రేక్షకులను మైమరపింపజేస్తోంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.