close
అవీ.. ఇవీ..
అడవి శేష్‌ను చూసి కన్నీరు పెట్టుకున్న యువతి

హైదరాబాద్‌: విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో విజయాలను అందుకుంటున్న కథానాయకుడు అడవిశేష్‌. ఇటీవల ‘ఎవరు’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. ఇందులో ఆయన నటనను ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎంతగానో మెచ్చుకున్నారు. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా విడులైంది. అయితే జపాన్‌కు చెందిన రీనా అనే యువతి టోక్యోలో ‘ఎవరు’ చిత్రాన్ని చూసింది. అయితే మనదేశంలో ‘ఎవరు’ సినిమా చూడాలని ఇండియాకు వచ్చారు. తన టీం ద్వారా ఈ విషయం తెలుసుకున్న అడవి శేష్‌ ఆమెను కలిశారు. అడవిశేష్‌ను చూడగానే ఆ యువతి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన్ని హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని అడవి శేష్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘‘ఎవరు’ చిత్రం చూసేందుకు జపాన్‌ నుంచి రీనా హైదరాబాద్‌కు వచ్చారు. నా టీం ఈ విషయం చెప్పగానే నాకు చాలా గొప్పగా అనిపించింది. నా మీద మీరు చూపించే ఈ అభిమానం, ప్రేమ నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది’ అని శేష్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ‘మేజర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మహేశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.
 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.