close
బాలీవుడ్
గ్యాంగ్‌స్టర్‌ ‘గంగూబాయ్‌’

సల్మాన్‌ ఖాన్‌, ఆలియా భట్‌ నాయకానాయికలుగా సంజయ్‌ లీలా భన్సాలీ  ప్రకటించిన ‘ఇన్‌షా అల్లా’ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తదుపరి భన్సాలీ ఏ చిత్రం చేస్తారన్న విషయం చర్చనీయాంశం అయింది. అయితే ఆయన ‘గంగూబాయ్‌’ చిత్రాన్ని పట్టాలెక్కించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గంగూబాయ్‌ కొఠెవాలి అనే మహిళా గ్యాంగ్‌స్టర్‌ జీవితం ఈ చిత్రానికి ఆధారం. బలవంతంగా వ్యభిచార కూపంలోకి వచ్చిన గంగూబాయ్‌, ఆ తర్వాత ముంబయిలోని ఓ ప్రాంతానికి శక్తిమంతమైన మహిళగా ఎదిగింది. వ్యభిచార వృత్తిలో హింసకు గురవుతున్న స్త్రీలకు పెద్ద దిక్కుగా మారింది. ఆమె పాత్రలో ఆలియా భట్‌నే ఎంచుకునే ఆలోచనలో భన్సాలీ ఉన్నట్లు సమాచారం. ఎలాగూ ‘ఇన్‌షా అల్లా’కు ఆలియా కేటాయించిన కాల్షీట్లు ఉండటంతో, ఆమెనే ఈ చిత్రానికి ఎంచుకోవడం ఖాయమని తెలుస్తోంది. అక్టోబరులో ఈ చిత్రంపై స్పష్టత రానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.