close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆహాలో ‘మెట్రో కథలు’.. టీజర్‌ విడుదల

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు ఓటీటీ ‘ఆహా’లో మరో కొత్త వెబ్‌ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు కరుణాకర్‌ దర్శకత్వంలో ‘మెట్రో కథలు’ అనే వెబ్‌ చిత్రం రాబోతుంది. వన్‌ సిటీ.. ఫోర్‌ స్టోరీస్‌ అనేది ఉప శీర్షక. తాజాగా ఈ వెబ్‌చిత్రం టీజర్‌ను దర్శకుడు మారుతీ విడుదల చేశారు. ఇందులో రాజీవ్‌ కనకాల, సన, అలీ రెజా, నందిని రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఒక నగరంలో ఉండే నలుగురి జీవితాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ప్రేమ, బాధ, సంతోషం వంటి నిత్య జీవితంలో ఉండే కష్టసుఖాలే నేపథ్యంగా ఈ చిత్రం ఉండనుంది. మహ్మద్‌ ఖాదీర్‌ బాబు కథ అందించగా.. అజయ్‌ అర్సదా సంగీతం సమకూర్చారు. కిరణ్‌రెడ్డి మందాడి, రామ్‌ మద్దుకూరి నిర్మాతలు. ఈ వెబ్‌ చిత్రం ‘ఆహా’లో ఆగస్టు 14న విడుదల కానుంది.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.