close
టాలీవుడ్‌
నటి వాణిశ్రీ కుమారుడి ఆత్మహత్య

సీనియర్‌ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె కుమారుడు అభినయ వెంకటేశ్‌ కార్తీక్‌ (36) బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ‘న్యూస్‌టుడే’కు తెలిపిన వివరాల ప్రకారం కార్తీక్‌ బెంగళూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. కొన్ని రోజులుగా చెన్నై శివారు తిరుక్కళుకుండ్రంలోని తండ్రి ఇంట్లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం కార్తీక్‌ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుర్తించిన తండ్రి కరుణాకరన్‌ తిరుక్కళుకుండ్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులను చూడలేకపోవడం, ఒత్తిడి కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు చెప్పారు. తిరుక్కళుకుండ్రం ఎస్సై వెంకటేశ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభినయ వెంకటేశ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

కుటుంబం కోసం..
నవలా చిత్రాల కథానాయికగా పేరు గాంచిన  వాణిశ్రీ దక్షిణాదిలోని మూడు భాషల్లో, మూడు దశాబ్దాలపాటు కథానాయికగా అలరించారు. 13 ఏళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. గతేడాది ఈటీవీలో ప్రసారమైన ‘ప్రేమ్‌నగర్‌’ ధారావాహిక కోసం మరోసారి మేకప్‌ వేసుకున్నారు. ‘‘వృత్తి వేరు, జీవితం వేరనుకునే మనస్తత్వం నాది. సినిమాలకి దూరమయ్యాక నా బిడ్డలు, వాళ్ల భవిష్యత్తు, నేను, నా జీవితం అంతే’’ అని ఓ సందర్భంలో ‘ఈనాడు సినిమా’తో చెప్పారు. వాణిశ్రీకి ఒక కూతురు, ఒక కుమారుడు. ముగ్గురు కొడుకుల్ని కనాలని అనుకునేవారట వాణిశ్రీ. కానీ అనారోగ్య సమస్య కారణంగా ఒక్కరితోనే సరిపెట్టుకున్నానని, తన అబ్బాయికి మూడు పేర్లు కలిసేలా పేరు పెట్టడానికి కారణం కూడా అదే అని ఓ సందర్భంలో చెప్పారు వాణిశ్రీ. ఆమె కూతురు అనుపమ కూడా వైద్యురాలే. అభినయ్‌ భార్యతో పాటు ఆయన తండ్రి కరుణాకరన్‌ కూడా వైద్యులే. తల్లి పెద్ద నటి అయినప్పటికీ కార్తీక్‌ మాత్రం ఎప్పుడూ సినిమాలపై ఆసక్తి ప్రదర్శించలేదు. వాణిశ్రీకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సన్నిహితులు. ఆమె  తనయుడి బలవన్మరణం గురించి తెలిసి పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, బాబుమోహన్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.  

-న్యూస్‌టుడే, కోడంబాక్కం

 


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.