close
టాలీవుడ్‌
8 గ్రామాలు దత్తత

కరోనా వైరస్‌ ప్రభావంతో గ్రామాల్లోనూ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చాలామంది ఉపాధిని కోల్పోయారు. అలాంటివాళ్ల కడుపు నింపడమే లక్ష్యంగా 8 గ్రామాల్ని దత్తత తీసుకున్నారు నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు. చిత్తూరు జిల్లా చంద్రగిరిమండలంలోని 8 గ్రామాల్లో పేదలకి మధ్యాహ్నం, రాత్రి ఆహారం అందిస్తున్నారు. ఆ 8 గ్రామాలతో పాటు మరికొన్ని సమీప గ్రామాలకి కూరగాయల్ని పంపిణీ చేస్తున్నారు.
అజిత్‌ సాయం రూ.1.25 కోట్లు: కరోనా సహాయ చర్యల కోసం నటుడు అజిత్‌ రూ.1.25 కోట్ల విరాళం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి, ప్రధానమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షల చొప్పున అందించినట్లు తెలిపారు. ‘ఫెప్సీ’ సహాయార్థం రూ.25 లక్షలు అందించారు.

- న్యూస్‌టుడే, టీనగర్‌

రామ్‌ తాళ్లూరి విరాళం రూ.5.50 లక్షలు: కరోనాపై పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త రామ్‌ తాళ్లూరి రూ.5.50 లక్షల విరాళం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  సహాయ నిధికి రూ.5 లక్షలు, సినీ కార్మికుల కోసం రూ.50 వేలు ఇస్తున్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.