close
టాలీవుడ్‌
స్వరాల కోసం బాలీవుడ్‌ నుంచి?

చిరంజీవి 152వ చిత్రానికి సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. తారాగణం, సాంకేతిక బృందం ఎంపికపై చిత్ర దర్శకుడు కొరటాల శివ, నిర్మాత రామ్‌చరణ్‌ ఓ నిర్ణయానికొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర స్వరాలకి సంబంధించిన బాధ్యతల్ని బాలీవుడ్‌ సంగీత ద్వయం అజయ్‌ - అతుల్‌కి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’, ‘జీరో’, ‘పీకే’, ‘సూపర్‌ 30’ తదితర హిందీ చిత్రాలకి పనిచేశారు అజయ్‌ - అతుల్‌. మరాఠీలో ‘సైరట్‌’తో పాటు, తెలుగులో  ఇదివరకు ‘షాక్‌’ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. చిరంజీవి కథానాయకుడిగా  నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి కూడా హిందీ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే అజయ్‌ - అతుల్‌లతో  కొరటాల శివ, రామ్‌చరణ్‌ చర్చలు జరిపినట్టు సినీ వర్గాలు స్పష్టం చేశాయి.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.