close
టాలీవుడ్‌
చైతూకు జోడీగా రష్మిక?

మ్మల్ని కథే కలిపిందనే మాట సినీ జనాల నుంచి తరచూ వినిపిస్తుంటుంది. ఆ మాట నిజం కూడా! ఎంత ప్రయత్నం చేసినా కలవని కొన్ని కలయికలు, కొన్నిసార్లు కథల వల్ల  కుదిరిపోతుంటాయి. వాళ్లని తప్ప మరొకర్ని ఊహించుకోలేని రీతిలో ఆ పాత్రలు తెరపై పండుతుంటాయి. ఎప్పుడు ఏ కథ ఎవర్ని కలుపుతుందో ఊహించలేం. అలా ఇప్పుడు ఒక కథ నాగచైతన్య - రష్మిక జోడీని కోరుకొంటోందని తెలిసింది. శశి అనే ఓ యువ దర్శకుడు నాగచైతన్య కోసం కథని సిద్ధం చేశారు. ఆ కథలో చైతూకి జోడీగా రష్మికని ఎంపిక చేసుకోవాలనే ప్రయత్నంలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. రష్మికకి త్వరలోనే కథ వినిపించబోతున్నట్టు తెలిసింది. రష్మిక ప్రస్తుతం మహేష్‌, నితిన్‌ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో జోడీ కట్టనుంది.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.