close
టాలీవుడ్‌
జై బాలయ్య జై బాహుబలి

‘‘ఏ చిత్ర పరిశ్రమలోనైనా కథా నాయకులకే ఎక్కువ గుర్తింపు వస్తుంది. కానీ, తెలుగులో కథానాయికలకూ ఆ స్థాయి ఆదరణ దక్కుతోంది. ఇది తెలుగు చిత్రసీమకు మాత్రమే ఉన్న ప్రత్యేకత’’ అంది సుకృత వాగ్లే. ఈ కన్నడ ముద్దుగుమ్మ ‘రామ చక్కని సీత’ చిత్రంతో తెలుగు తెరపై నాయికగా అడుగు పెడుతోంది. ఈనెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం  హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది సుకృత.
* ‘‘పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోనే. మోడలింగ్‌ చేస్తూ కన్నడలో కథానాయికగా మారా. అక్కడ ఇప్పటి వరకు 7 చిత్రాలు చేశా. కన్నడ బిగ్‌బాస్‌-4 షోలోనూ పాల్గొన్నా. ‘రామ చక్కని సీత’లో తెలుగు అమ్మాయినే తీసుకోవాలనుకున్నారు. ఇందులో హీరోయిన్‌ పాత్రకు చాలా పెద్ద డైలాగ్‌లు ఉంటాయి. కానీ నేను తెలుగు నేర్చుకుని నటిస్తానని మాటివ్వడంతో ఈ అవకాశమిచ్చారు. సెట్స్‌లో ఉన్నప్పుడు తెలుగు తప్ప మరే భాష మాట్లాడొద్దని దర్శకుడు శ్రీహర్ష నన్ను  ఆదేశించారు. అందుకే ఇంత త్వరగా తెలుగు నేర్చుకోగలిగా’’.
* ‘‘ఈ చిత్రంలో నేను అను అనే అమ్మాయిగా కనిపిస్తా. హీరో పేరు బాలు. దర్శకుడు శ్రీహర్ష.. పవన్‌ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్‌. ఆయనకి ‘తొలిప్రేమ’ చిత్రమంటే పిచ్చి. అందుకే ఆ సినిమాలోని పాత్రల పేర్లనే మాకు పెట్టారు. తెలుగు చిత్రసీమలో కొత్తవాళ్లకు మంచి ప్రోత్సాహం దక్కుతోంది. ఇక్కడి హీరోలందరూ నాకిష్టమే. ప్రత్యేకంగా ఓ  అభిమాన హీరో పేరు చెప్పాల్సి వస్తే ‘జై బాలయ్య’ అంటా. ఎందుకంటే నేను బాలకృష్ణ అభిమానిని. ‘బాహుబలి’ సినిమా అంటే ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా’’.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.