
‘‘ఏ చిత్ర పరిశ్రమలోనైనా కథా నాయకులకే ఎక్కువ గుర్తింపు వస్తుంది. కానీ, తెలుగులో కథానాయికలకూ ఆ స్థాయి ఆదరణ దక్కుతోంది. ఇది తెలుగు చిత్రసీమకు మాత్రమే ఉన్న ప్రత్యేకత’’ అంది సుకృత వాగ్లే. ఈ కన్నడ ముద్దుగుమ్మ ‘రామ చక్కని సీత’ చిత్రంతో తెలుగు తెరపై నాయికగా అడుగు పెడుతోంది. ఈనెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది సుకృత.
* ‘‘పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోనే. మోడలింగ్ చేస్తూ కన్నడలో కథానాయికగా మారా. అక్కడ ఇప్పటి వరకు 7 చిత్రాలు చేశా. కన్నడ బిగ్‌బాస్-4 షోలోనూ పాల్గొన్నా. ‘రామ చక్కని సీత’లో తెలుగు అమ్మాయినే తీసుకోవాలనుకున్నారు. ఇందులో హీరోయిన్ పాత్రకు చాలా పెద్ద డైలాగ్‌లు ఉంటాయి. కానీ నేను తెలుగు నేర్చుకుని నటిస్తానని మాటివ్వడంతో ఈ అవకాశమిచ్చారు. సెట్స్‌లో ఉన్నప్పుడు తెలుగు తప్ప మరే భాష మాట్లాడొద్దని దర్శకుడు శ్రీహర్ష నన్ను ఆదేశించారు. అందుకే ఇంత త్వరగా తెలుగు నేర్చుకోగలిగా’’.
* ‘‘ఈ చిత్రంలో నేను అను అనే అమ్మాయిగా కనిపిస్తా. హీరో పేరు బాలు. దర్శకుడు శ్రీహర్ష.. పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనకి ‘తొలిప్రేమ’ చిత్రమంటే పిచ్చి. అందుకే ఆ సినిమాలోని పాత్రల పేర్లనే మాకు పెట్టారు. తెలుగు చిత్రసీమలో కొత్తవాళ్లకు మంచి ప్రోత్సాహం దక్కుతోంది. ఇక్కడి హీరోలందరూ నాకిష్టమే. ప్రత్యేకంగా ఓ అభిమాన హీరో పేరు చెప్పాల్సి వస్తే ‘జై బాలయ్య’ అంటా. ఎందుకంటే నేను బాలకృష్ణ అభిమానిని. ‘బాహుబలి’ సినిమా అంటే ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా’’.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం