ఆ ఇద్దరు గోవాకు ఎందుకెళ్లారు? - why Alia Bhatt And Ranbir Kapoor Flew To Goa
close
Updated : 08/07/2021 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఇద్దరు గోవాకు ఎందుకెళ్లారు?

దిల్లీ: బాలీవుడ్‌ స్టార్‌  హీరోహీరోయిన్లు రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ ప్రేమ ప్రయాణం కొనసాగుతోంది.తాజాగా వీరు గోవాకు వెళ్లిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఈ ప్రేమ పావురాలు సోమవారం గోవాకు అత్యవసరంగా ఎందుకెళ్లాయో తెలుసా?ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేందుకట. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌లో ముంబయి జట్టుకు రణ్‌బీర్‌ కపూర్‌ సహయజమానిగా వ్యహరిస్తున్నాడు. సోమవారం గోవాలో జంషెడ్‌పూర్‌ జట్టుతో ముంబయి సిటీ జట్టుకు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. దీనిని వీక్షించేందుకు ఈ ఇద్దరూ అక్కడి వెళ్లారట. దీనికి సంబంధించిన ఫొటోలను ముంబయి సిటీ జట్టు అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది.

2018లో సోనమ్‌ కపూర్‌- ఆనంద్‌ ఆహుజా పెళ్లి వేడుకలో ఇద్దరూ కలిసి పాల్గొనడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అప్పట్లో వార్తలొచ్చాయి. తాజాగా అయాన్‌ ముఖర్జీ నిర్మిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’  సినిమాలో వీరిద్దరూ కలిసి తెరను పంచుకోనున్నారు. ఈ చిత్రంలో స్టార్‌ కథానాయకులు అమితాబ్‌ బచ్చన్, అక్కినేని నాగార్జున తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని