ఆ హీరోతో మల్టీస్టారర్‌ చేయాలనుంది: నితిన్‌ - want to do a multistarer film with pawankalyan says nithin
close
Published : 24/02/2021 19:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ హీరోతో మల్టీస్టారర్‌ చేయాలనుంది: నితిన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటనాపరంగా తన కెరీర్‌లో ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అంటున్నాడు నితిన్‌. భవిష్యత్తుపై ప్రత్యేక ప్రణాళికలేం లేవంటూనే విభిన్న కథలను ఎంచుకొంటూ ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తానని తన ప్లాన్‌ చెప్పకనే చెప్పేశారు. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లవుతోంది ఇంకా నాపై లవర్‌బాయ్‌గా ముద్రవేయడం సరికాదని తన మనసులోని మాట బయటపెట్టారు. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ నటించిన ‘చెక్‌’ ఫిబ్రవరి 26 విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఆయన విలేకరులతో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

‘భీష్మ’ మంచి కమర్షియల్‌ హిట్‌. ఆ తర్వాత ఇలాంటి సినిమా చేయడం వెనుక కారణం..?

ప్రత్యేకంగా కారణం అంటూ ఏం లేదు. నిజానికి భీష్మ, చెక్‌ రెండు సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నాను. ఒకటి కమర్షియల్‌, ఇంకోటి భిన్నమైన కథతో సినిమా చేయాలనే ఆలోచనతోనే దీనికి ఓకే చెప్పాను. కరోనా లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌ ఆలస్యం కావడంతో ‘చెక్‌’ కొంచెం ఆలస్యమైంది. భీష్మ ముందే వచ్చేసింది.

డైరెక్టర్‌ చెప్పిన కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది..?

డైరెక్టర్‌ నాకు మొదట చెప్పిన కథ వేరు. అది కూడా బాగానే ఉంది. ఆ కథతో రెండు నెలలు పనిచేశాం కూడా. అయితే.. ఎందుకో దానిపై డైరెక్టర్‌ నమ్మకంగా ఉన్నట్లు కనిపించలేదు. నాక్కూడా అలాగే అనిపించింది. అందుకే ఇంకో కథ రాశారు. ఈ లైన్‌ చెప్పగానే నాకు బాగా నచ్చింది. సినిమా అంతా జైలులోనే, ఒకటే పాట.. ఇలా అంతా కొత్తగా అనిపించింది. సినిమాలో అన్నింటికంటే బాగా నచ్చింది క్లైమాక్స్‌. సినిమా హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మీ అందరికీ నచ్చుతుందని గట్టి నమ్మకం ఉంది. 

ఖైదీ పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు..?

ప్రత్యేకంగా సన్నద్ధం కావడంలాంటిది ఏం లేదు. సెట్‌కు వెళ్లిన తర్వాత డైరెక్టర్‌ ఏం చెబితే అది చేయడమే. అయితే ఇంతకుముందు సినిమాలు చేసేటప్పుడు సినిమా సెట్లో కామెడీ చేస్తూ.. అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండేవాడిని. కానీ. ఈ సినిమాకు మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే జైలులో ఖైదీ పాత్ర కాబ్టటి కామ్‌గా ఎవరితో మాట్లాడకుండా ఓ పక్కనే ఓ ఖైదీలా కూర్చొని ఉండిపోయా.

నా కెరీర్‌లో నటన పరంగా ఇప్పటి వరకూ చేసిన సినిమాలు వేరు. ఇది వేరు 

ఎక్కువ పాటలుంటే బాగుండేది అనిపించలేదా..?

అలాంటిదేం లేదు. సినిమా మొత్తం ఒక ఎత్తయితే.. కల్యాణిమాలిక్‌గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరో ఎత్తు. ఆర్‌ఆర్‌ విన్నప్పుడు నాకు చాలా రోమాలునిల్చున్నాయి. ఇలాంటి సినిమాకు ఆర్‌ఆర్‌ చాలా ముఖ్యం. పైగా ఇందులో ఎక్కువ పాటలు లేవు. సినిమా మొత్తం స్టోరీనే ఉంటుంది. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లో ఉంటూ ప్రేక్షకులు ఓటీటీల్లో రకరకాల సినిమాలు చూశారు. వాళ్లు కూడా సినిమాల్లో కొత్తదనం కోరుకుంటున్నారు. అలాంటి వాళ్లకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి సినిమాలో రకుల్‌ చేయడం గొప్ప విషయం. ఆమె పాత్రకు పాటలు లేవు. మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాన్స్‌ కూడా లేదు. ఒకటే పాట ఉంటుంది. అది కూడా ప్రియతో ఉంటుంది. ప్రియకు తెలుగులో మొదటి సినిమా అయినా బాగా కష్టపడిందామె.

లవర్‌బాయ్‌ అనే ముద్ర నాకు నచ్చదు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇది 19వ సంవత్సరం. ఒక నుంచి భిన్నమైన సినిమాలు చేయాలనుకుంటున్నా.

చెస్‌ ఆడుతుంటారా..? మీకు ఇష్టమైన ఆట..?

చిన్నప్పుడు చెస్‌ ఆడుతుండేవాడిని. ఈ సినిమా వల్ల మళ్లీ ఆడుతున్నా. ఇంట్లో మా భార్య, చెల్లితో ఆడుతూ ఉంటా. నిజానికి నాకు క్రికెట్‌ అంటే బాగా ఇష్టం. అయితే.. ఇప్పటికే క్రికెట్‌ మీద చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తీసిన పెద్దగా ఎవరూ చూడరేమో. అందుకే క్రికెట్‌ గురించి సినిమాలు చేసే ఆలోచనలైతే లేవు. 

సీక్వెన్స్‌ తీయాలనుకుంటే ‘సై’ తీస్తా. ‘చెక్‌’ ఆడితే దీన్ని కూడా తీయొచ్చు.

తర్వాత సినిమాల విషయంలో ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు..?

అలా ఏం లేదు. అయితే.. భిన్నమైన కథలు ఎంచుకుంటూ ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలని మాత్రం అనుకుంటున్నా. దేవుడి దయవల్ల ఈ సంవత్సరంలో మూడు సినిమాలు వస్తున్నాయి. ‘పవర్‌పేట’ కూడా వస్తే నాలుగవుతాయి. ఆ సినిమా బహుశా డిసెంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. మే నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుంది. అది రెండు భాగాలు ఉంటుంది. మొదటిది బాగా ఆడితే రెండోది తీస్తాం(నవ్వుతూ).

ఈ సినిమాలో హీరో జైలుకు వెళ్లకముందు ఒక కామన్‌మ్యాన్‌. తనకు తానే కింగ్‌ అనుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జైలుకు వస్తాడు. ఆ తర్వాత ఉరిశిక్ష వేయాలని తీర్పు వస్తుంది. అయితే.. చెస్‌ నేర్చుకొని ఎలా గ్రాండ్‌మాస్టర్‌ అయ్యాడు.. అసలు ఆ ఆటను ఉపయోగించుకొని ఉరి శిక్ష నుంచి ఎలా బయటపడ్డాడనేదే కథ.

నా కెరీర్‌లో ఛాలెంజింగ్‌ సినిమా అంటే ‘పవర్‌పేట’. 20ఏళ్లు, 40ఏళ్లు, 60ఏళ్లు.. ఇలా మూడూ భిన్నమైన వయసున్న పాత్రల్లో నేను కనిపిస్తాను. ఇక ‘రంగ్‌దే’ విషయానికి వస్తే షూటింగ్‌ పూర్తయింది. అదే నాకు చివరి లవ్‌స్టోరీ అనుకుంటున్నా. 

మల్టీస్టారర్‌ చేసే అవకాశం వస్తే పవన్‌కల్యాణ్‌గారితో చేస్తా


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని