Drushyam 2: అటు శర్వా.. ఇటు అఖిల్‌ మధ్యలో వెంకీమామ? - venkatesh drushyam 2 will release on dasara festival season
close
Updated : 01/09/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Drushyam 2: అటు శర్వా.. ఇటు అఖిల్‌ మధ్యలో వెంకీమామ?

ఇంటర్నెట్‌డెస్క్‌: వెంకటేశ్‌ కథానాయకుడిగా జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్‌ మూవీ ‘దృశ్యం2’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, మాతృక బాటలోనే ఓటీటీలో విడుదల చేస్తారా? లేక థియేటర్‌లో సందడి చేయనుందా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. చిత్రీకరణ పూర్తయినా ఇంకా విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోందట. అందుకు తగినట్లు ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టనుంది. అయితే, దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు దసరా సందర్భంగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమతున్నాయి. ఇప్పటికే శర్వానంద్‌-సిద్ధార్థ్‌ కాంబినేషన్‌లో అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ‘మహా సముద్రం’ అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందే అక్టోబరు 8న అఖిల్‌-పూజాహెగ్డేల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడు ఈ రెండు చిత్రాల మధ్యలోకి ‘దృశ్యం2’ వచ్చి చేరనుందని టాక్‌. అక్టోబరు 13న ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. ఒకవేళ కుదరపోతే ఓటీటీలో వచ్చే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని