Venkatesh: అందుకే అవి నన్నెప్పుడూ మార్చలేదు - venkatesh about his career
close
Published : 11/05/2021 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Venkatesh: అందుకే అవి నన్నెప్పుడూ మార్చలేదు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితంలో విజయం వచ్చినా.. పరాజయం ఎదురైనా ఒకేలా ఉండటం కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి కొద్దిమందిలో నటుడు వెంకటేశ్‌ ఒకరు. ఆయన అలా ఉండేందుకు కారణం ఏంటో ఓ సందర్భంలో ఇలా పంచుకున్నారు. ‘జీవితంలో, సినిమాలో మూడు దశలుంటాయి. 1. పనిచేయడం, 2.ఫలితం గురించి ఆలోచించకుండా ఉండటం, 3. ఆ తర్వాత ఫలితం ఎలాంటిదైనా స్వీకరించడం. మంచో చెడో.. ఏదైనా కావొచ్చు. మనల్ని మనం స్వీకరించాలి. ఓ సినిమా ఫ్లాప్‌ అయితే.. మన పని అయిపోయింది అనే భయం మొదలవుతుంది. హిట్‌ అందుకుంటే మనమే గొప్ప అనే అతివిశ్వాసం పెరుగుతుంది. ఇవి రెండూ మంచివి కావు. అందుకే ఓ సినిమా చివరి దశలో ఉన్పప్పుడే నేను మానసికంగా బయటకు వచ్చేస్తా. తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తా. అందుకే హిట్లూ, ఫ్లాపులూ నన్ను ఎప్పుడూ మార్చలేకపోయాయి’ అని తెలిపారు. త్వరలో ‘నారప్ప’, ‘దృశ్యం 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు వెంకటేశ్‌. ఇప్పటికే ఆయన పాత్రలకు (నారప్ప, దృశ్యం 2) సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని