లైఫ్‌లో ముఖ్యమైంది ఏంటో తెలిపింది: అనుష్క
close
Published : 02/04/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లైఫ్‌లో ముఖ్యమైంది ఏంటో తెలిపింది: అనుష్క

ప్రియమైన విరాట్‌తో నటి.. ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్‌

ముంబయి: క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, కథానాయిక అనుష్క శర్మ స్వీయ నిర్బంధంలో ఉంటూ ఎంతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. వృత్తిపరమైన పనులతో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే ఈ జంట ఇప్పుడు ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా ఇంట్లో సంతోషంగా ఉన్నారు. ఈ లాక్‌డౌన్‌ మనందరికీ జీవితంలో ముఖ్యమైంది ఏంటో తెలిపిందని అనుష్క అన్నారు. ఈ మేరకు ఆమె విరాట్‌తో కలిసి పెంపుడు జంతువుతో ఆడుకుంటున్న ఫొటోను బుధవారం ఉదయం షేర్‌ చేశారు. తన మనసులోని మాటల్ని ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.

‘ప్రతి నల్ల మేఘానికి వెండి అంచు ఉంటుంది. కానీ ఈసారి దాని ప్రభావం తీవ్రంగా ఉంది. మనల్ని ఎన్నో విధాలుగా ఇబ్బందిపెడుతోంది. దీని వల్ల మనం రోజూ పరుగులు తీస్తూ ‘బిజీ’గా చేసే పనుల్ని బలవంతంగా ఆపుకోవాల్సి వచ్చింది. ఈ కాలాన్ని గౌరవిస్తే.. అది మరింత కాంతిని ప్రకాశిస్తుంది. జీవితంలో నిజంగా ముఖ్యమైంది ఏంటో ఈ సమయం మనకు అర్థమయ్యేలా చేసింది. నా వరకు తినడానికి ఆహారం, నీరు.. నా తలపైన ఓ కప్పు (ఇల్లు).. నా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఇవి కాకుండా నా జీవితంలో ఉన్నవంతా నాకొచ్చిన బోనస్‌.. దానికి కృతజ్ఞురాల్ని. కానీ మనం ప్రాథమిక అవసరాలు అనుకునే ఆ కొద్ది వాటి కోసం ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నా. అందరూ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలి’.

‘ఈ సమయం నన్ను ఇంకా పారదర్శకంగా చేసింది. ఈ ప్రపంచం అంతా కలిసి మనల్ని మన ప్రియమైన వారితో ఇంట్లో ఉండేలా చేసింది. ఇందులో మనందరికీ లోతైన పాఠం ఉంది. వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేయాలనే ఒక పాఠం నేర్పింది (నేను చాలా సంవత్సరాలుగా దీని కోసం కష్టపడుతున్నా). ముఖ్యమైన వాటి కోసం సమయం కేటాయించాలని తెలిపింది. ఇవాళ దేవుడి ఆశీర్వాదంతో నా జీవితంలోకి వచ్చిన వాటితో ఆనందంగా ఉన్నా. కానీ కష్టాల్లో ఉన్న వారిని చూసినప్పుడు నాకెంతో బాధగా అనిపిస్తుంది. వారికి నా వంతు సహాయం చేయాలి అనుకుంటున్నా. ఈ సమయంలో మనం ఇంకా ఉత్తమంగా మారుతున్నందుకు గర్వంగా ఉంది. మనమంతా దీన్నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఇలాంటి పాఠాలు మనతో జీవితాంతం ఉంటాయని ఆశిస్తున్నా’ అని అనుష్క సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. దీన్ని చూసిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కాజల్‌, ఏక్తా టైగర్‌, రుహానీ శర్మ, సానియా మీర్జా, మౌనీరాయ్‌ తదితరులు అనుష్క మాటల్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు.

 Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని