‘హరిహర వీరమల్లు’ వచ్చేది అప్పుడే! - the upcoming pawan movie for sankranthi is harihara veeramallu
close
Published : 29/04/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘హరిహర వీరమల్లు’ వచ్చేది అప్పుడే!

ఇంటర్నెట్ డెస్క్: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్‌ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌తో చాలా సినిమాలు షూటింగ్‌తో పాటు విడుదల తేదీలను సైతం వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా కూడా వాయిదా పడనుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలపై ఎ.ఎం.రత్నం స్పందిస్తూ... ‘‘సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికే తెరపైకి రానుంది. దర్శకుడు క్రిష్‌ అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేస్తారు. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే తెలుస్తుంది. అంతేకాదు సంక్రాంతి పండగ అంటే ఇంకా చాలా సమయం ఉంది. అందువల్ల చిత్రం విడుదలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని’’ వెల్లడించారు. 

17వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఆ మధ్య బాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ శ్యామ్‌ కౌశల్‌ నేతృత్యంలో పవన్‌పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ - సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో కథానాయకుడిగా మలయాళంలో విజయవంతమైన ‘అయప్పనుమ్‌ కోషియం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ‘పీఎస్‌పీకే30’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని