‘వకీల్‌ సాబ్‌’పై ఫిర్యాదు - the complaint against the vakeel saab movie
close
Published : 04/05/2021 04:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌ సాబ్‌’పై ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: అనుమతి లేకుండా వకీల్‌సాబ్‌ చిత్రంలో ఓ సన్నివేశంలో తన ఫోన్‌ నంబరును ఉపయోగించారంటూ సుధాకర్‌ అనే వ్యక్తి సోమవారం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కథానాయిక అంజలికి చెందిన ఫొటోలను అసభ్యకరంగా మార్చినట్లు సినిమాలో ఓ సన్నివేశం ఉందని, అందులో అంజలి ఫోటో కింద తన ఫోన్‌ నంబరు ఉండటం వల్ల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నిరంతరం ఫోన్లు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆయన పోలీసులకు తెలిపారు. చిత్ర యూనిట్‌ సభ్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని