Venkatesh: చైసామ్‌ నిర్ణయం.. పెదవి విప్పే ముందు ఆలోచించాలి - telugu news venkatesh new post on instagaram goes viral
close
Published : 06/10/2021 10:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Venkatesh: చైసామ్‌ నిర్ణయం.. పెదవి విప్పే ముందు ఆలోచించాలి

వైరల్‌గా మారిన వెంకీ పోస్ట్‌

హైదరాబాద్‌: ఇకపై భార్యాభర్తలుగా కలిసి ఉండటం లేదంటూ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు నాగచైతన్య-సమంత జోడీ. ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు వాళ్లిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా నటుడు వెంకటేశ్‌ పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట్లో  వైరల్‌గా మారింది. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి’ అంటూ వెంకీ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా పరిస్థితులకు అనుగుణంగానే ఆయన ఈ పోస్ట్‌ పెట్టారా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది..: సామ్‌ తండ్రి

సామ్‌-చై నిర్ణయంపై తాజాగా సమంత తండ్రి స్పందించారు. వాళ్ల జోడీ చూడముచ్చటగా ఉండేదని.. అలాంటిది, ఇప్పుడు వాళ్లిద్దరూ విడిపోవడం దురదృష్టకరమని అన్నారు. అంతేకాకుండా.. వాళ్లిద్దరూ విడిపోతున్నారని తెలిసి మైండ్‌ బ్లాంక్ అయ్యిందని.. ఏం చేయాలో అర్థం కాలేదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు వివరించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని