Tollywood: ‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేశ్‌.. రానా సర్‌ప్రైజ్‌.. ‘అఖండ’ మెలొడీ - telugu news tollywood latest updates bandla ganesh balakrishna rana
close
Published : 17/09/2021 17:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: ‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేశ్‌.. రానా సర్‌ప్రైజ్‌.. ‘అఖండ’ మెలొడీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్ర దర్శకుడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు హరీశ్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘డేగల బాబ్జీ’ అనే పేరుని చిత్ర బృందం ఖరారు చేసింది. కథానాయకుడి పాత్రకి సంబంధించిన ప్రీ లుక్‌తో కూడిన టైటిల్‌ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. తమిళంలో పార్తిబన్‌ నటించిన ‘ఒత్తు సెరుప్పు సైజ్‌ 7’కి రీమేక్‌ ఇది. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రానా సర్‌ప్రైజ్‌..

పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. టైటిల్‌ పాత్రని పవన్‌ కల్యాణ్‌ పోషిస్తుండగా రానా డేనియల్ శేఖర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్రకి సంబంధించిన ఓ సర్‌ప్రైజ్‌ని సెప్టెంబరు 20న అందించనున్నట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ప్రీ లుక్‌ని పంచుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్‌ గీతానికి శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది.

బాలకృష్ణ గీతాలాపన..

బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం ‘అఖండ’. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. ఎప్పుడెప్పుడా అని సంగీత ప్రియులు ఎదురుచూస్తోన్న ఈ చిత్రంలోని తొలి గీతం విడుదలకి సిద్ధమైంది. ‘అడిగా అడిగా’ అనే మెలొడీని సెప్టెంబరు 18న సాయంత్రం 5:33 ని.లకి చిత్రబృందం విడుదల చేయనుంది. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని