Srikanth: ఆల్రెడీ బాలయ్యకు విలనయ్యా.. రామ్‌ చరణ్‌కూ విలనవుతా! - telugu news srikanth plays antogonist in balayya and shankar ramcharan movies
close
Updated : 30/09/2021 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Srikanth: ఆల్రెడీ బాలయ్యకు విలనయ్యా.. రామ్‌ చరణ్‌కూ విలనవుతా!

హైదరాబాద్‌: హీరోగా ప్రేక్షకుల్ని అలరించిన శ్రీకాంత్‌ ప్రస్తుతం సహాయనటుడిగా, విలన్‌గా రాణిస్తున్నారు. తాజాగా ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. అక్టోబర్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గురువారం ఆయన ఈనాడుతో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా.. తాను ‘అఖండ’ సినిమాలో బాలయ్యకు విలన్‌గా నటిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, శంకర్‌-రామ్‌చరణ్‌ సినిమాలోనూ తానే ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు తెలిపారు.

‘‘శ్రీరామరాజ్యం’ తర్వాత బాలకృష్ణతో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ’లో మెయిన్‌ విలన్‌గా నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నా  పాత్ర చాలా క్రూరంగా ఉంటుంది. సినిమా విడుదలయ్యాక నన్ను చూసి మహిళలు భయపడతారు. నన్ను బాగా తిట్టుకుంటారు కూడా. ఇందులో నా రోల్‌ కోసం 40 గెటప్‌లు టెస్ట్‌ చేశాం. చివరికి బాలయ్యే నా గెటప్‌ ఫిక్స్‌ చేశారు. ‘అఖండ’తోపాటు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సిద్ధం కానున్న రామ్‌చరణ్‌-శంకర్‌ చిత్రంలోనూ విలన్‌గా కనిపించనున్నాను. ఆ భారీ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషిస్తున్నాను. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు ఇప్పుడే బయటకు చెప్పలేను. తెలుగులోనే కాకుండా కన్నడలోనూ ఓ సినిమా ఓకే చేశాను. పునీత్‌ రాజ్‌కుమార్‌ కథానాయకుడు నటిస్తున్న ఓ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాను’’ అని శ్రీకాంత్‌ అన్నారు.

అలాగే తన తనయుడు రోషన్ పెళ్లిసందడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఆనందంగా ఉందన్న శ్రీకాంత్... నాటి పెళ్లిసందడి రోజులను ఈ చిత్రం మరిపిస్తుందన్నారు. తాను 23 ఏళ్ల వయస్సులో పెళ్లిసందడి చిత్రంలో నటిస్తే తన కుమారుడు 22 ఏళ్ల వయస్సులో రాఘవేంద్రరావు పిలిపించి అవకాశం ఇవ్వడం మరిచిపోలేని అనుభూతిని కలిగించిందన్నారు. రోషన్ చిత్రాన్ని తెరపై చూడటానికి ఎంతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్న శ్రీకాంత్... ఈ దసరాకు పెళ్లిసందడి థియేటర్లలో రాబోతుందని తెలిపారు. అలాగే తన అఖండ కూడా దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ఒకే రోజు తండ్రీకొడుకులిద్దరూ వేరువేరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం తమ కుటుంబానికి ఎప్పటికి మరిచిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుందన్నారు.

అనంతరం సాయితేజ్‌ ఆరోగ్యంపై శ్రీకాంత్‌ స్పందించారు. ‘సాయితేజ్‌ చాలా మంచి వ్యక్తి. నిన్ననే సాయితో మాట్లాడాను. ఇప్పుడిప్పుడే అతని ఆరోగ్యం మెరుగవుతోంది. త్వరలోనే ఆయన ఆరోగ్యంగా మన ముందుకు వస్తారు. ‘రిపబ్లిక్‌’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆయన అన్నారు.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని