Rajinikanth: రాష్ట్రపతి, ప్రధానితో ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ రజనీకాంత్‌ - telugu news rajinikanth met narendra modi and ramnath kovind
close
Updated : 27/10/2021 18:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajinikanth: రాష్ట్రపతి, ప్రధానితో ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ రజనీకాంత్‌

ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) సతీసమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ramnath Kovind)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ (Dada Saheb Phalke) అవార్డు అందుకున్న నేపథ్యంలో రజనీకాంత్‌ని ప్రధానమంత్రి కార్యాలయానికి ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్‌ దంపతులతో ప్రధాని, రాష్ట్రపతి కాసేపు ముచ్చటించారు. అనంతరం ఫొటోలు దిగారు. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు రజనీకాంత్‌ చేస్తోన్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయన్ను ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ పురస్కారంతో గౌరవించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) చేతుల మీదుగా రజనీకాంత్‌ ఈ అవార్డును అందుకున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని