KGF2: రమిక.. భయపెట్టే   ప్రధాన మంత్రి - telugu news prasanthneel Shares Special Pic From KGF2 To wish Raveena Tandon
close
Updated : 27/10/2021 07:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

KGF2: రమిక.. భయపెట్టే   ప్రధాన మంత్రి

యశ్‌ కథా నాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కెజిఎఫ్‌ 2’. ఈ సినిమాలో రమిక సేన్‌ అనే శక్తిమంతమైన పాత్రలో రవీనా టాండన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రవీనా పుట్టినరోజు సందర్భంగా.. ఆమె కొత్త లుక్‌ను ప్రశాంత్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ‘‘ఇందులో రమిక పాత్రని మీరు పోషించినట్లు ఎవరూ పోషించి ఉండరు. నేను పని చేసిన అత్యంత ఆహ్లాదకరమైన, భయపెట్టే ప్రధాన మంత్రి. రవీనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ ఆ ఫొటోకు ఓ వ్యాఖ్యను జత చేశారు ప్రశాంత్‌ నీల్‌. ఈ చిత్రంలో అధీరా అనే ప్రతినాయకుడిగా సంజయ్‌ దత్‌ నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని