NBK 107: వాటిని నమ్మొద్దు.. సరైన సమయంలో ప్రకటిస్తాం! - telugu news nbk 107 movie team about title
close
Published : 15/09/2021 19:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NBK 107: వాటిని నమ్మొద్దు.. సరైన సమయంలో ప్రకటిస్తాం!

ఇంటర్నెట్ డెస్క్‌: బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘NBK 107’ వర్కింగ్‌ టైటిల్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ‘ఆ టైటిల్‌ ఖరారు చేశారు’, ‘ఈ పేరు పెట్టారంటూ’ గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. దీనిపై చిత్రబృందం తాజాగా స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని, అలాంటి రూమర్లు నమ్మొద్దని ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘NBK 107’ సినిమా పేరు గురించి వస్తోన్న వార్తలు అవాస్తవమైనవి. సరైన సమయంలో మేమే టైటిల్‌ని అధికారికంగా ప్రకటిస్తాం. మరిన్ని అప్‌డేట్లు అందిస్తాం’ అని పేర్కొంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. బాలకృష్ణ పవర్‌ఫుల్‌ లుక్‌లో దర్శనమివ్వనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సూపర్‌ హిట్‌ చిత్రం ‘క్రాక్‌’ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వస్తుండటంతో ‘NBK 107’ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న చిత్రమిది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని