Narappa: ‘నారప్ప’ షూటింగ్‌ లొకేషన్లని చూశారా! - telugu news narappa shooting locations venkatesh
close
Published : 03/08/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Narappa: ‘నారప్ప’ షూటింగ్‌ లొకేషన్లని చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘నారప్ప’. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రీకరణకి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు వెంకటేశ్‌. ఇందులో సినిమాని ప్రారంభించిన ముహూర్తపు షాట్‌, దేవాలయం, థియేటర్‌ తదితర లొకేషన్లు చూపించారు. ఒక్కో సన్నివేశాన్ని తెరకెక్కించేందుకు చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ‘‘నారప్ప’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తెరకెక్కించేందుకు సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని స్వీకరించి, షూటింగ్‌ సజావుగా సాగేందుకు చిత్ర బృందం బాగా శ్రమించింది. ఈ చిత్రంలో ప్రత్యేకంగా నిలిచే కొన్ని సన్నివేశాల లొకేషన్లని ఈ వీడియోలో చూడండి’ అని వెంకటేశ్‌ పేర్కొన్నారు. తమిళ సినిమా ‘అసురన్‌’కి రీమేక్‌గా ‘నారప్ప’ రూపొందింది. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రాజీవ్‌ కనకాల, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కళైపులి ఎస్‌. థాను సమర్ఫణలో సురేశ్‌ బాబు నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని