Sarkaru Vaari Paata: వైరల్‌గా ‘సర్కారు వారి పాట’ వీడియో! - telugu news mahesh babu sarkaru vaari paata video viral
close
Published : 26/10/2021 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sarkaru Vaari Paata: వైరల్‌గా ‘సర్కారు వారి పాట’ వీడియో!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ బాబు హీరోగా పరశురామ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లొకేషన్‌లో మహేశ్‌ బాబు, మహిళల బృందం (డ్యాన్సర్లు) డ్యాన్స్‌ చేస్తున్న వీడియో అది. అందులో మహేశ్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. మరోవైపు, సెట్‌లో తీసిన మహేశ్‌ ఫొటోను సంగీత దర్శకుడు తమన్‌ షేర్‌ చేశారు. స్టైలిష్‌ లుక్‌లో, గొడుగు పట్టుకుని కనిపించారు మహేష్‌. మరో ఫొటోలో ఇదే లొకేషన్‌లో నాయిక కీర్తి సురేశ్‌తో మాట్లాడుతూ కనిపించారు మహేశ్‌ సతీమణి నమ్రత శిరోద్కర్‌. ఇలా ఒకేసారి ఇన్ని సర్‌ప్రైజ్‌లు రావడంతో మహేశ్‌ అభిమానులు ఆనందపడుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 





Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని