చేనేత గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిది: కేటీఆర్‌ - telugu news ktr about tamasoma jyothirgamaya movie
close
Updated : 13/10/2021 20:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేనేత గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిది: కేటీఆర్‌

హైదరాబాద్‌: చేనేత వృత్తిలో ఎన్నో ఆవిష్కరణలు రావాలని, ఇందుకు ‘తమసోమా జ్యోతిర్గమయ’లాంటి చిత్రాలు దోహదపడతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. ‘ఈ చిత్రం చేనేత వృత్తిలోని కష్టాలు, కన్నీళ్లనే మాత్రమే కాదు చేనేత గొప్పదనాన్ని చాటిచెబుతుంది. యువత ఈ రంగంవైపు అడుగేసేలా చేస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఆనంద్‌రాజ్‌, శ్రామణిశెట్టి జంటగా నటించిన చిత్రమిది. భూదాన్‌ పోచంపల్లికి చెందిన బడుగు విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. విమల్‌ క్రియేషన్స్‌ పతాకంపై తడక రమేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకురానుంది.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని