Dulquer Salmaan: యూఏఈ ‘గోల్డెన్‌ వీసా’ పొందిన దుల్కర్‌ సల్మాన్‌ - telugu news dulquer salmaan receives uae golden visa
close
Published : 16/09/2021 19:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dulquer Salmaan: యూఏఈ ‘గోల్డెన్‌ వీసా’ పొందిన దుల్కర్‌ సల్మాన్‌

దుబాయ్‌: మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్‌ వీసా’ని పొందారు. యూఏఈ ప్రభుత్వ అధికారులు తనకి వీసా అందిస్తున్న ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ‘ఈ వీసాని తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమా రంగానికి సంబంధించి అబుదాబి ప్రభుత్వం రూపొందించిన భవిష్యత్తు ప్రణాళిక అద్భుతంగా ఉంది. ఈ ప్రభుత్వం స్థానికంగా, అంతర్జాతీయంగా కొత్త ప్రతిభని ప్రోత్సహించనుంది. అబుదాబి, యూఏఈలో షూటింగ్‌ కోసం ఎదురుచూస్తున్నా. ఇకపై ఎక్కువ సమయం ఇక్కడ గడపొచ్చు’ అని దుల్కర్‌ తెలిపారు.

ప్రముఖ నటుడు మమ్ముట్టి తనయుడే దుల్కర్ సల్మాన్‌. ‘మహానటి’ చిత్రంలో జెమిని గణేశ్‌గా నటించి, తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ప్రస్తుతం హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో లెఫ్టినెంట్ రామ్‌గా కనిపించనున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని