Narappa: వెంకటేశ్‌ నటనకు ఫిదా అయిన చిరు - telugu news chiranjeevi appreciated venkatesh acting in narappa movie
close
Published : 24/07/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Narappa: వెంకటేశ్‌ నటనకు ఫిదా అయిన చిరు

ఇంటర్నెట్‌ డెస్క్: ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల అందరినోట ‘నారప్ప’ మాటే వినిపిస్తుంది. అంతగా ఆ సినిమా ఆకట్టుకుంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వెంకటేశ్‌ నటనకి ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఎందరో తారలు వెంకటేశ్‌ నటన, చిత్రంపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన చిరంజీవి.. వెంకటేశ్‌ని ప్రశంసించారు. ఆ మాటల్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ చిరుకి థ్యాంక్స్‌ చెప్పారు వెంకటేశ్‌. 

‘‘నేనిప్పుడే ‘నారప్ప’ చూశాను. ముందుగా కంగ్రాట్స్‌. వావ్‌.. ఏం నటన. నాకెక్కడా వెంకటేశ్‌ కనిపించలేదు. నారప్ప మాత్రమే కనిపించాడు. మొత్తంగా కొత్త వెంకటేశ్‌ని చూస్తున్నా నేను. పాత్రని లోతుగా అర్థం చేసుకుని నటించావు వెంకీ. నీలోని నటుడు ఎప్పుడూ తపనతో ఉంటాడు. నీకు సంతృప్తినిచ్చే సినిమా ‘నారప్ప’. ఇది మీ కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే చిత్రమవుతుంది. మరోసారి నీకు, చిత్రబృందానికి కంగ్రాట్స్‌’’. - చిరంజీవి.

తమిళ సినిమా ‘అసురన్‌’ రీమేక్‌గా ‘నారప్ప’ని తెరకెక్కించారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ వేసవిలో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఇటీవల ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైంది. ప్రియమణి, రాజీవ్‌ కనకాల, రావు రమేశ్‌, కార్తీక్‌ రత్నం తదితరులు కీలక పాత్రలు పోషించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని