Akhanda: ‘అఖండ’ మ్యూజిక్‌ జాతర షురూ..! ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది..! - telugu news akhanda music feest starts
close
Updated : 18/09/2021 17:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akhanda: ‘అఖండ’ మ్యూజిక్‌ జాతర షురూ..! ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘అఖండ’ మ్యూజిక్‌ జాతర షురూ అయ్యింది. అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ఫుల్‌ టైమ్‌ మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని మొదటిపాటను శనివారం చిత్రబృందం విడుదల చేసింది. ‘అడిగా అడిగా’ అంటూ సాగే ఈ ఫీల్‌గుడ్‌ మెలోడి అందర్నీ ఆకట్టుకునేలా ఉంది.

‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యాజైశ్వాల్‌ సందడి చేయనున్నారు. శ్రీకాంత్‌, జగపతిబాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని