Venkatesh: 35 ఏళ్ల నట ప్రస్థానం.. వెంకటేశ్‌ చిత్రాలన్నీ ఒకే వీడియోలో..! - telugu news actor venkatesh completed 35 years in industry
close
Updated : 15/08/2021 17:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Venkatesh: 35 ఏళ్ల నట ప్రస్థానం.. వెంకటేశ్‌ చిత్రాలన్నీ ఒకే వీడియోలో..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమాయకత్వంలో ఆయన పేరు ‘చంటి’. సహనంలో ‘రాజా’, ‘శీను’. ఆయన వంశం ‘సూర్యవంశం’. ఆయన.. ప్రజలకు అండగా నిలిచే ‘చినరాయుడు’. అందరి మనసులు దోచే ‘అబ్బాయిగారు’. ‘శత్రువు’ల పని పట్టేటందుకు ‘ఒంటరి పోరాటం’ చేసే ‘గణేశ్‌’. అతను కూలీగా నెం. 1. అంతేకాదు ‘సూపర్‌ పోలీస్‌’.. ‘సూర్య ఐ.పి.ఎస్‌’ కూడా. అంతేనా.. అతనో ‘పోకిరి రాజా’, ‘బొబ్బిలి రాజా’, ‘బాడీగార్డ్‌’, ‘సరదా బుల్లోడు’, ‘దేవీ పుత్రుడు’. ‘ప్రేమతో..రా’, ‘ప్రేమించుకుందాం..రా’ అంటూ తన ‘ప్రేమ’ని వ్యక్తం చేశాడు. ‘సుందరకాండ’, ‘నారప్ప’గా చదువు విలువ చెప్పాడు. బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చి ‘గురు’ అయ్యాడు. మాస్‌, క్లాస్‌ అనే బేధం లేకుండా అందరితోనూ ‘బాబు బంగారం’ అనిపించుకున్నాడు. ఇంతకీ ఆయన ఎవరంటారా? ఇంకెవరు మన ‘వెంకీమామ’.

వెంకటేశ్‌ నట ప్రస్థానానికి 35 ఏళ్లు. కథానాయకుడిగా ఆయన నటించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1986 ఆగస్టు 14న విడుదలైంది. విజయ్‌ అనే పాత్రతో ప్రేక్షకులకి పరిచయమైన వెంకటేశ్‌ తొలి ప్రయత్నంలోనే నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్య కథల్ని ఎంపిక చేసుకుని టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఎక్కువ రీమేక్‌ చిత్రాల్లో నటించిన హీరోగానే కాకుండా, విజయం అందుకున్న నటుడిగానూ రికార్డు సృష్టించారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు. కుటుంబ కథా ప్రేక్షకుల్ని అలరించే కథల్లో కనిపిస్తూనే యూత్‌, మాస్‌ వర్గాలనీ మెప్పించే చిత్రాలు చేశారు. ఉత్తమ నటుడిగా ఏడు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు సొంతం చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ‘ఎఫ్‌ 3’ చిత్రంతో బిజీగా ఉన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వచ్చిన ‘ఎఫ్‌ 2’కి రీమేక్‌గా రూపొందిస్తున్నారు. వరుణ్‌ తేజ్‌ మరో కథానాయకుడు. తమన్నా, మెహరీన్‌ కౌర్‌ నాయికలు.

సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రత్యేక వీడియో..

నటుడిగా వెంకటేశ్‌ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌. వెంకటేశ్‌ చిత్రాల పోస్టర్లతో ఈ వీడియోను రూపొందించారు. తన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ నుంచి ఇటీవల విడుదలైన ‘నారప్ప’ వరకు అన్ని చిత్రాల్నీ ఈ వీడియోలో చూడొచ్చు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని