Cinema News: నవ్వించే ప్రేమికుడు - telugu news Mister Premikudu Latest press meet
close
Updated : 27/10/2021 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: నవ్వించే ప్రేమికుడు

ప్రభుదేవా కథానాయకుడిగా శక్తి చిదంబరం తెర కెక్కించిన చిత్రం ‘చార్లీ చాప్లిన్‌2’. ఇప్పుడీ సినిమాని ‘మిస్టర్‌ ప్రేమికుడు’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు నిర్మాతలు వి.శ్రీనివాసరావు, గుర్రం మహేష్‌ చౌదరి. అదా శర్మ, నిక్కి గల్రాని కథానాయికలు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది చిత్ర బృందం. నిర్మాతలు మాట్లాడుతూ..‘ఎక్కడా రాజీ పడకుండా స్ట్రయిట్‌ తెలుగు సినిమాలా డబ్బింగ్‌ చేయించాం. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది. పాటలతో పాటు ద్వితీయార్ధంలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా డ్యాన్స్‌, అదా..నిక్కీల అందం మరో ఆకర్షణ. తమిళంలో లాగే తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు ఈ కార్యక్రమంలో  టి.ప్రసన్న కుమార్‌, ముత్యాల రాందాస్‌, గోపాల్‌  పాల్గొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని