Miles of love Trailer: పాటలతో బలం పెరిగింది - telugu news Miles of love Trailer launched By Kartikeya
close
Updated : 27/10/2021 07:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Miles of love Trailer: పాటలతో బలం పెరిగింది

అభినవ్‌ మేడిశెట్టి, రమ్య పసుపులేటి జంటగా నందన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మైల్స్‌ ఆఫ్‌ లవ్‌’. రాజురెడ్డి నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. కథానాయకుడు కార్తికేయ ముఖ్య అతిథిగా హాజరై థియేట్రికల్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌, పాటలు చాలా బాగున్నాయి. ధ్రువన్‌ మంచి సంగీతం ఇచ్చారు. నిర్మాతకి ఇది తొలి సినిమానే అయినా నందన్‌లాంటి మంచి దర్శకుడినీ, ఈ కథని ఎంపిక చేసుకున్నార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇందులో యువతరానికి నచ్చే అన్ని వాణిజ్యాంశాలూ ఇందులో ఉంటాయి’’ అన్నారు. ‘‘సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన గీతం ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది’’ అన్నారు నిర్మాత. బెక్కం వేణుగోపాల్‌, పాగల్‌ చిత్ర దర్శకుడు నరేష్‌, నిర్మాత బాబ్జి, దినేష్‌, గాయత్రి గుప్తా, సంగీత దర్శకుడు ఆర్‌.ఆర్‌.గుప్తా, గీత రచయితలు పూర్ణాచారి, ఆలరాజు, ఛాయాగ్రాహకుడు రవిమణి పాల్గొన్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని