Ghani: ‘గని’.. కనివిని ఎరుగని - telugu news Ghani anthem Promo Released
close
Updated : 27/10/2021 07:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ghani: ‘గని’.. కనివిని ఎరుగని

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఈ సినిమా డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  నేపథ్యంలోనే మంగళవారం ‘గని ఆంథమ్‌’ ప్రోమోను విడుదల చేశారు. ‘‘దే కాల్‌ హిమ్‌ గని కనివిని ఎరుగని’’ అంటూ సాగుతున్న ఈ పాటకు తమన్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి పాటను బుధవారం ఉదయం 11:08 గంటలకు విడుదల చేయనున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో వరుణ్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. సునీల్‌ శెట్టి, ఉపేంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని