Romantic: ఈ పాత్ర గుర్తుండిపోతుంది - telugu news Actor Akash Puri Latest Interview On Romantic
close
Updated : 27/10/2021 08:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Romantic: ఈ పాత్ర గుర్తుండిపోతుంది

‘‘నేనిప్పుడు ఏదో ఒక జానర్‌కు పరిమితం కావాలని అనుకోవట్లేదు. మల్టీప్లెక్స్‌ నుంచి సింగిల్‌ స్క్రీన్‌ వరకు నా సినిమాల్ని అందరూ చూడాలని అనుకుంటున్నా. ఇకపై అలాంటి కథల్నే ఎంచుకోవాలనుకుంటున్నా’’ అన్నారు ఆకాష్‌ పూరి. ఇప్పుడాయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాదూరి తెరకెక్కించారు. పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. కేతిక శర్మ కథానాయిక. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు ఆకాష్‌.

వాస్కోడిగామాగా...
‘‘ఇదొక రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. శక్తిమంతమైన పోరాటాలతో పాటు చాలా ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంది. నేనిందులో వాస్కోడిగామా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్రంలో ఊహించని మలుపులేమీ ఉండవు కానీ, కచ్చితంగా సినిమా చూస్తే ఎగ్జైట్‌ అవుతారు. చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు అనే పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. నా వాస్కోడిగామా పాత్ర అందరికీ అలా గుర్తుండిపోతుంది. రమ్యకృష్ణ గారితో పనిచేయడం అదృష్టంగా ఫీలవుతున్నా’’.

సక్సెస్‌ కొట్టాకే.. నాన్నతో సినిమా చేస్తా
‘‘ప్రీరిలీజ్‌ వేడుకలో నేను నాన్న గురించి మాట్లాడిన మాటలు విని ఆయన చాలా సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఆయన గర్వంగా కాలర్‌ ఎగరేసేలా చేయాలి. అది ఈ చిత్రంతో జరుగుతుందా? మరో సినిమాతో సాధ్యమవుతుందా? అన్నది ఇప్పుడే చెప్పలేను. సక్సెస్‌ కొట్టాకే.. వెళ్లి నాన్నతో ఓ సినిమా చేస్తాను’’.

ఈ కథ చేస్తానని అసలు ఊహించలేదు
‘‘నాకోసమే ప్రత్యేకంగా సిద్ధం చేసిన కథ కాదిది. నాన్న ఈ సినిమా లైన్‌ ఎప్పుడో రాసి పెట్టుకున్నారు. ఆయన ఓరోజు దర్శకుడు అనిల్‌ని పిలిచి ‘ఈ సినిమాకు ఆకాష్‌ హీరో.. నువ్వు దర్శకుడివి’ అని చెప్పారు. దాంతో ఇద్దరం షాక్‌ అయ్యాం. ఎందుకంటే ఈ కథని నేను చేస్తానని.. అనిల్‌ తెరకెక్కిస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘రొమాంటిక్‌’ రెండూ ఒకే సమయంలో జరిగాయి. అయితే ‘ఇస్మార్ట్‌..’ పెద్ద హిట్టవ్వడంతో.. దీన్ని ఇంకా బాగా తీయాలని అనుకున్నాం. అప్పుడే రమ్యకృష్ణ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె రాకతో సినిమా స్థాయి మారిపోయింది’’.

భయమేసి పారిపోదామనుకున్నా..
‘‘ఈ కథ విన్నాక.. నాన్నని ఒకటే అడిగా. ఏం చేయమంటే అది చేస్తాను. ఎక్కడి నుంచి దూకమంటే అక్కడి దూకుతాను.. కానీ, ఈ రొమాన్స్‌ తగ్గించు నాన్న అన్నాను. సినిమానే రొమాంటిక్‌.. అందులో రొమాన్స్‌ తగ్గించమంటావేంట్రా అన్నారు. స్క్రీన్‌ మీద రొమాన్స్‌ చేయడం చాలా కష్టం. సెట్‌లో ఎన్నోసార్లు భయమేసింది.  పారిపోదామా? అనిపించేది (నవ్వుతూ)’’.

‘‘ఇప్పుడే కాదు కానీ, ఓ పదేళ్ల తర్వాత అయినా సరే తప్పకుండా దర్శకత్వం చేస్తా. నాన్నకి రెమ్యునరేషన్‌ ఇచ్చి ఆయన కథ తీసుకొని.. దర్శకత్వం చేస్తా. ముందు హీరోగా నిరూపించుకున్న తర్వాతే డైరెక్షన్‌ వైపు దృష్టి పెడతా. ప్రస్తుతం ‘చోర్‌ బజార్‌’ సినిమా చేస్తున్నా. అందులో బచ్చన్‌ సాబ్‌ అనే పాత్రలో నటిస్తున్నా. వాణిజ్యాంశాలతో నిండిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అది. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. వచ్చే ఏడాది విడుదలవుతుంది’’



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని