close
Published : 07/07/2020 04:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కొంత మంది మంచిలోనూ చెడునే చూస్తారు’

ముంబయి: మంచి విషయాలపై మాట్లాడుతున్నప్పుడు కూడా కొంత మంది చెడునే చూస్తారని నటి తాప్సీ అంటున్నారు. సినీ నేపథ్యం లేకుండా వచ్చి ఎదిగిన నటులను తాప్సీ లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తున్నారని ఓ నెటిజన్‌ చేసిన ట్వీన్‌ను జోడిస్తూ బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ బృందం తాప్సీపై ట్వీటర్‌ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సినీ నేపథ్యం లేకుండా వచ్చిన కొందరు కంగనా ప్రారంభించిన ప్రతి ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. వారంతా మూవీ మాఫియా దృష్టిలో మంచి వారిగా ఉండాలనుకుంటున్నారు. అందుకే బహిరంగంగానే మహిళపై వేధింపుల్లో భాగమవుతున్నారు. తాప్సీ.. నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం.. తన కష్టాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు’’అంటూ తాప్సీని ఉద్దేశించి కంగనా బృందం ట్వీట్‌ చేసింది.

అయితే వీరి విమర్శలపై తాప్సీ నేరుగా స్పందించకుండా పరోక్షంగా సమాధానం చెప్పారు. ‘‘కొన్ని నెలలుగా నేను పలు విషయాలను అనుసరిస్తున్నాను. అవి జీవితాన్ని కొత్త కాంతుల్లో చూడటానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఎంతో ప్రశాంతతను తీసుకొచ్చాయి. దృక్పథాన్ని మార్చాయి’’అంటూ టోనీ గాస్కిన్స్‌ అనే వ్యక్తిత్వ వికాస నిపుణుడు చెప్పిన వ్యాఖ్యతోపాటు పలు వ్యాఖ్యలను ట్వీట్‌ చేసింది. 

‘‘చెడు వ్యక్తులను కూడా దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి వారి గురించి మనం ప్రార్థించాలి. మంచి విషయాల్లోనూ వారు ఎప్పుడూ చెడునే చూస్తారు. నీతో వారు సంతోషంగా ఉండరు. ఎందుకంటే వారిలో వారికే గిట్టదు. అలాంటి వారితో మీరూ చెడుగా ప్రవర్తించకండి. ఉన్నతంగా ఆలోచించి.. వారు ఎదగాలని ప్రార్థించండి’’

‘‘సంతోషంగా లేని వాళ్లు మిమ్మల్ని వారి స్థాయికి దింపేందుకు యత్నిస్తుంటారు. ఎలా ప్రవర్తించకూడదో వారి ప్రవర్తనను చూసి తెలుసుకొని మంచిగా ఉండేందుకు యత్నించాలి’’

‘‘మీరు ఉన్నతంగా ఉన్నప్పుడే మరింత ఉన్నత స్థాయికి ఎదగగలరు. చెడ్డతనం అనేది గతానికి సంబంధించింది. ఉన్నతంగా ఉండటమంటే భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టినట్లే’’ అంటూ తాప్సీ ట్వీట్‌ చేసింది. 

తెలుగునాట వెండితెరకు పరిచయమైన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ మంచి విజయాలు అందుకుంటోంది. తాప్సీ నటించిన ‘థప్పడ్‌’ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై విమర్శకులను సైతం మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘హసీన్‌ దిల్‌రుబా’.. తమిళంలో ‘జన గణ మన’ చిత్రాల్లో నటిస్తోంది. కరోనా కారణంగా ఆ రెండు చిత్రాల షూటింగ్స్‌ నిలిచిపోయాయి. 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని