సుశాంత్‌సింగ్‌ సీరియల్‌ పునఃప్రసారం
close
Published : 09/07/2020 22:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌సింగ్‌ సీరియల్‌ పునఃప్రసారం

ముంబయి: బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్‌కు గురిచేసింది. గత నెలలో సుశాంత్‌ తన ఇంట్లోనే ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో బాలీవుడ్‌ ప్రముఖులతోపాటు అతని అభిమానులు సైతం కలత చెందారు. చక్కటి అభినయంతో బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై.. తన కలను సాకారం చేసుకున్న సుశాంత్‌ ఇలా ఆకస్మాత్తుగా లోకాన్ని విడిచి వెళ్లడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అతడు నటించిన చివరి సినిమా ‘దిల్‌ బెచారా’ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలై విశేష ఆదరణ అందుకుంది. సుశాంత్‌ చనిపోయిన తర్వాత ఓటీటీ వేదికగా ఈ చిత్రం విడుదల అవుతుండగా.. బుల్లితెరపై అతడు నటించిన ఓ సీరియల్‌ను కూడా ఓటీటీలో పునఃప్రసారం చేయబోతున్నారు. 

సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలనుకున్న సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌కు మొదట సీరియల్స్‌లోనే అవకాశం లభించింది. దీంతో వాటిలో నటించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అంకితా లోఖండేతో కలిసి నటించిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌ సుశాంత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో సుశాంత్‌ మానవ్‌ దేశ్‌ముఖ్‌ పాత్రలో నటించి అందరికి చేరువయ్యాడు. ఏక్తా కపూర్‌ నిర్మించిన ఈ సీరియల్‌ 2009లో ప్రారంభమైంది. 1,424 ఎపిసోడ్స్‌తో దాదాపు ఐదేళ్లపాటు ప్రసారమైంది. ఈ సీరియల్‌లో నటిస్తూనే సుశాంత్‌, అంకితా లోఖండే ప్రేమలో పడ్డారు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌ను పునఃప్రసారం కానుంది. ఓటీటీ ‘జీ5’లో ఈ సీరియల్‌ అందుబాటులో ఉండబోతుంది. దీంతో సుశాంత్‌ అభిమానులు ఈ సీరియల్‌ను చూస్తూ మరోసారి తమ అభిమాననటుడిని గుర్తు చేసుకుంటారని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని