రానా ఎవ్వరి మాటా వినడు: సురేశ్‌బాబు - suresh babu about his son rana
close
Published : 21/07/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రానా ఎవ్వరి మాటా వినడు: సురేశ్‌బాబు

హైదరాబాద్‌: సినిమాల విషయంలో రానా ఎవ్వరి మాటా వినడని ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు అన్నారు. కెరీర్‌ ప్రారంభం నుంచి వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నటుడు రానా. తనకు నచ్చితే ఆ పాత్ర కోసం ఎంత కష్టపడతారో ‘బాహుబలి’లో ఆయన పోషించిన భళ్లాలదేవుడి పాత్రే నిదర్శనం. కాగా, ఇటీవల ‘నారప్ప’ ప్రమోషన్‌లో భాగంగా రానా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సురేశ్‌బాబు.

‘‘ఫలానా చిత్రాలు చెయ్‌’ అని చెప్పినా రానా వినడు. తనకు కావాల్సినట్టే చేస్తాడు. తనకంటూ కొన్ని సొంత అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని బట్టే నిర్ణయం తీసుకుంటాడు. ఫలానా సినిమా, పాత్ర చేస్తున్నానని చెబుతాడంతే. మేము కూడా సరే అంటాం. అయితే, ఓవరాల్‌గా కొన్ని సూచనలు ఇస్తాం తప్ప, ప్రత్యేకంగా ‘ఇలా చెయ్‌’ అని మాత్రం చెప్పం. తను తీసుకునే అన్ని నిర్ణయాలు తనవే. రానా కన్న కలలు సాకారం కావడానికి  మేం కేవలం మా వంతు సాయం చేస్తామంతే’’ అని సురేశ్‌బాబు చెప్పుకొచ్చారు. తన చిన్న కుమారుడు అభిరామ్‌ కూడా ఒక ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని