హైదరాబాద్: సుధీర్-రష్మి.. యువతలో ఈ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే పలు షోలలో రష్మి-సుధీర్ జోడీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. తాజాగా వీరిద్దరూ తమ పెళ్లి గురించి తొలిసారి పెదవి విప్పారు.
రోజా, మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీ ప్రసారమవుతున్న ఖతర్నాక్ కామెడీ షో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’. రష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకు సంబంధించిన సరికొత్త ప్రోమో ఇప్పుడు ఎంతగానో ఆకర్షిస్తోంది. పెళ్లి కాన్సెప్ట్‌తో సరదా సత్తిపండు, అదుర్స్ ఆనందం చేసిన ఫన్నీ స్కిట్లో సుధీర్ అతిథిగా కనిపించి ఆకట్టుకున్నారు. స్కిట్ పూర్తయ్యాక రోజా.. ‘సుధీర్.. ఎప్పటి నుంచో నీ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాం. ఇంతకీ పెళ్లి ఎప్పుడు?’ అని ప్రశ్నిస్తారు. వెంటనే సుధీర్ పక్కనే ఉన్న రష్మి వైపు చూసి చిరునవ్వులు చిందిస్తారు. అనంతరం రోజా.. రష్మిని సైతం ఇదే ప్రశ్న వేయగా.. ఆమె కూడా సుధీర్ వైపు చూసి సిగ్గుపడతారు. చివరికి సుధీర్ మాట్లాడుతూ.. ‘పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉంది మేడమ్’ అని సమాధానమిస్తారు. సుధీర్ చెప్పిన జవాబుకు రోజా కౌంటర్ వేయడంతో స్టేజ్‌పై ఉన్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు. సుధీర్, రష్మి తమ పెళ్లి గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం వరకూ వేచి చూడాల్సిందే. జనవరి 29న ప్రసారం కానున్న ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ప్రోమో చూసేయండి..!
ఇదీ చూసేయండి..
ఫిక్స్ అయిన పెళ్లి.. క్యాన్సిల్ అయ్యింది: షకీలా
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ