చిత్రం: సర్ (హిందీ)
దర్శకత్వం: రొహెనా గెరా
నటీనటులు: వివేక్ గొంబర్, తిలోతమ షోమ్
నిడివి: 1.39 గంటలు
ఎక్కడ చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్
ప్రస్తుత సమాజంలో ఎన్నో అంతరాలున్నాయి. కుల, మతాంతరాల్లాగే.. యజమానులు, పనివాళ్ల జీవితాల మధ్యనా ఓ వ్యత్యాస రేఖ ఉంటుంది. ఇంటి పనిమనుషుల విషయంలో ఇది మరింత ఎక్కువే. వంట చేసి, ఇంటిని, బాత్రూం శుభ్రం చేసే వారంటే తమకంటే తక్కువన్న భావన సమాజంలో ఎక్కువమందిలో ఏర్పడింది. సాటి మనుషులుగానూ గుర్తించని సందర్భాలుంటాయి. సమాజంలో ఇలా రెండు పూర్తి భిన్నమైన జీవితాల మధ్య నున్న గీతను చెరిపేస్తూ... అశ్విన్, రత్నల సున్నితమైన ప్రేమ కథను అందించారు రొహెనా గెరె. విడుదలకు అష్టకష్టాలు పడిన ‘సర్’ చిత్రం ఈ మధ్యే నెట్ఫ్లిక్స్లోకొచ్చి అలరిస్తోంది. 2018లోనే కేన్స్ ఫిల్మ్ వేడకలో ప్రదర్శితమైంది. విదేశాల్లో అప్పుడే విడుదలైనా... భారతదేశంలో 2020 నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రొహెన్ గెరా దర్శకత్వంలో వివేక్ గొంబర్, తిలోతమ షోమ్ కలిసి నటించిన ‘సర్’ చిత్ర పరిచయంతో ఈనాటి ‘ప్రేక్షకాలమ్’ మీ ముందుకొచ్చింది.
కథ: రత్న... మహారాష్ట్రలోని ఓ మారుమూల పల్లెటూరు నుంచి ముంబయికి వచ్చిన పేదింటి యువతి. తనలాగా చెల్లి జీవితం కాకూడదని కోరుకొనే సగటు అక్క. ఇక్కడ పనిమనిషిగా చేస్తూ చెల్లి చదువుకు అయ్యే ఖర్చు భరిస్తుంటుంది. ఆమె పనిచేసేది అశ్విన్ అనే సంపన్నుడి ఇంట్లో. ఆయన అమెరికాలో అప్పుడప్పుడే ఎదుగుతోన్న రచయిత. తన తమ్ముడి మరణంతో కుటుంబానికి అండగా ఉండేందుకు ముంబయికి తిరిగొస్తాడు. అప్పటికే ప్రేమించిన అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయి, అదే బాధలో జీవితాన్ని నిస్సారంగా వెల్లదీస్తుంటాడు. అలాంటి సమయంలో పని మనిషి రత్న తన జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది. వారిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడింది అనేది మిగతా కథ.
జీవితం సాగిపోవాల్సిందే: చివరి వరకు కథ సున్నితమైన భావోద్వేగాలతో సాగిపోతూ ప్రేక్షకులకు అందమైన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే దర్శకురాలు ఈ సినిమా ద్వారా సామాజికపరమైన చాలా విషయాలను చర్చలోకి తెచ్చారు. ముఖ్యంగా మనుషుల మధ్య ఉండే ఆర్థిక, సామాజిక తేడాను ఆకట్టు కొనేలా తెరకెక్కించారు. సంపన్నుడైనా, సకల సౌకర్యాలున్నా.. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుంటాడు అశ్విన్. జీవితంలో అన్ని కోల్పోయినా.. రత్న చాలా ఆశావాహ దృక్పథంతో జీవితాన్ని కొనసాగిస్తుంటుంది. ప్రేయసి మోసాన్ని తలచుకుంటూ బాధపడే అశ్విన్‌కు రత్న చెప్పే మాటలే గొప్ప సాంత్వన చేకూరుస్తాయి. అలా వారిమధ్య ఆత్మీయత ఏర్పడుతుంది. జీవితం ఇక్కడే ఆగిపోదు.. ఎలాగైనా ముందుకు సాగించాల్సిందే.. అని ఆమె చెప్పే మాటలు.. తన యజమానికే కాదు.. జీవితంలో ముందుకు కదలకుండా ఆగిపోయిన వారందరికీ చెప్పినట్లు అనిపిస్తుంది.
కలలు కనే హక్కు అందరిదీ: రత్న ఫ్యాషన్ డిజైనర్ కావాలకుంటుంది. నువ్వు సాధించలేవన్న సందేహం వ్యక్తం చేస్తాడు అశ్విన్. ఆ తర్వాత తన తప్పును ఒప్పుకొని కలలు కనే హక్కు అందరిదీ అని ప్రోత్సహిస్తాడు. మన ఆర్థిక, సామాజిక స్థాయిలు... కలలు కనడంలో, వాటిని సాకారం చేసుకోవడంలో ఏ మాత్రం అడ్డురావని కొన్ని సన్నివేశాల్లో తెలియజెప్పే ప్రయత్నం చేసింది దర్శకురాలు. వీరి మధ్య ఉండే ఆ అనుబంధం చివరి వరకూ కొనసాగేలా అందమైన సన్నివేశాలను అల్లుకోవడంలో దర్శకురాలు విజయం సాధించింది.
ఒకే అపార్ట్మెంట్లో: సినిమా అంతా.. దాదాపు ఒకే అపార్ట్మెంట్లో జరుగుతుంది. ముంబయి వీధులను, సాధారణ జీవితాలను చక్కగా చూపిస్తూ... సన్నివేశాల్లో వైవిధ్యాన్ని కనబరిచారు సినిమాటోగ్రాఫర్ కొలిన్. సందర్భానికి అనుగుణంగా వచ్చే పాటలు, రాఘవ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ఇంటికొచ్చిన అతిథి రత్నను తిట్టినప్పుడు అండగా నిలబడే విధానం, రత్న ఓ కొత్త చొక్కాను కుట్టించి బహుమతిగా ఇచ్చినప్పుడు, ప్రేమను వ్యక్తం చేసినప్పుడు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడి హృదయానికి హత్తుకుంటాయి. తన సొంత కాళ్లమీద నిలబడాలనుకొనే రత్న పాత్రలో నటించిన తిలోతమ షోమ్ నిజంగా జీవించేసింది. సంపన్నుడైన అశ్విన్ పాత్రలో వివేక్ నటన ప్రశంసించదగిందే. నిరాశ, నిస్పృహల చీకట్లు అలుముకున్న జీవితాల్లో ఆశావాహ కిరణాలు ప్రసరించే చిత్ర ‘సర్’.
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ