close

తాజా వార్తలు

Updated : 30/10/2020 16:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షారుఖ్‌ తెరపై కనపడేది వచ్చే ఏడాది దీపావళికేనా? 

ముంబయి: షారుఖ్‌ఖాన్‌ తెరపై కనిపించి రెండేళ్లు అయిపోయింది. వరస ప్లాఫ్‌లు రావడంతో హిట్‌ కొట్టాలని చాలా కథలు విన్నాడు. చాలా కథలకు గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చేశాడు. ముందుగా ‘పఠాన్‌’ మొదలుకానుంది. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ‘వార్‌’ చిత్రంతో విజయం అందుకున్న సిద్థార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో దీపికా పదుకొణె నాయిక. జాన్‌ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

షారుఖ్‌ రెడ్‌ చిల్లీస్‌ నుంచి ‘లవ్‌ హాస్టల్‌’

విక్రాంత్‌ మస్సే, సన్నా మల్హోత్రా, బాబీ డియోల్‌ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘లవ్‌ హాస్టల్‌’ అనే పేరుని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని షారుఖ్‌ ఖాన్‌ నిర్మాణ సంస్థ రెడ్‌చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, దృశ్యమ్‌ ఫిలిమ్స్‌ నిర్మించనున్నాయి. ఓ యువ ప్రేమ జంట, ఓ కిరాయి హంతకుడి మధ్య సాగే కథ ఇది. గతంలో ‘గుర్గాన్‌’ చిత్రానికి దర్శకత్వం  వహించిన శంకర్‌ రామన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.