తమిళనాడులో ‘100%’కి కేంద్రం బ్రేక్‌! - revoke 100 pc movie theatre occupancy decision says home ministry to tn govt
close
Published : 07/01/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళనాడులో ‘100%’కి కేంద్రం బ్రేక్‌!

దిల్లీ: సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో సీట్ల సామర్థ్యాన్ని నూరు శాతానికి పెంచేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు కేంద్రం అంగీకరించలేదు. తక్షణమే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనా నేపథ్యంలో 50 శాతం సీట్ల సామర్థ్యంతో మాత్రమే థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సంక్రాంతి పండగను దృష్ట్యా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వినతుల మేరకు నూరు శాతం సామర్థ్యం పెంచేందుకు తమిళనాడు ప్రభుత్వం తాజా అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఇది విపత్తు నిర్వహణ ఆదేశాలను ఉల్లంఘించేలా ఉందని హోంశాఖ పేర్కొంది. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం కేంద్ర మార్గదర్శకాలను పాటించాలని స్పష్టంచేశారు. 

ఇవీ చదవండి..
తమిళనాడు థియేటర్లలో 100శాతం సీట్ల భర్తీకి ఓకే

‘ఆచార్య’ సెట్లో స్మార్ట్‌ఫోన్లు పంచిన సోనూ


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని