‘రెడ్’ సక్సెస్ మీట్లో హీరో రామ్
విశాఖపట్నం: తనకు అసలైన పోటీ ఎవరనేది పదిహేనేళ్ల తర్వాత ఇప్పుడు తెలిసిందని రామ్ పోతినేని అన్నారు. ఇప్పటిదాకా ఒకలెక్క.. ఇకపై ఒక లెక్క అంటూ అభిమానులకు ఎంటర్టైన్మెంట్పై భరోసా కల్పించారు. రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెడ్’ విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. తమిళంలో వచ్చిన ‘తడమ్’కు రీమేక్‌గా వచ్చిందీ చిత్రం. రామ్ సరసన మాళవికశర్మ, నివేదా పేతురాజ్, అమృత అయ్యర్ నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను విశాఖపట్నంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడారు.. ‘‘సినిమాను అందరం కష్టపడి.. ఇష్టపడి చేశాం. సినిమా ఇంతబాగా రావడానికి ముఖ్య కారణం కిషోర్. సినిమాకు కెప్టెన్ ఆయనే. మణిశర్మ గారితో ఇస్మార్ట్ శంకర్ చేశాను. మళ్లీ ఇప్పుడు కలిసి పనిచేశాం. మా కాంబినేషన్ ఇలాగే కొనసాగుతుంది. మాళవిక.. బాగా పనిచేసింది. ఇప్పుడు టాలీవుడ్ క్రష్ ఆమె. ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీశాం. రిలీజ్‌కు ముందు మేం కొంచెం టెన్షన్ పడ్డాం. రివ్యూలు ఎలా వస్తాయో.. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అని అనుకున్నాం. కానీ.. సినిమాలో ట్విస్టులకంటే సినిమా విడుదలయ్యాక ట్విస్టులే ఎక్కువయ్యాయి. మీరంతా భారీ కలెక్షన్లతో థ్రిల్ ఇచ్చారు. ఇంతమంచి విజయం అందించిన ప్రేక్షకుల అందరికీ థాంక్స్. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఇదే సంక్రాంతికి ‘దేవదాసు’తో వచ్చాను. ఈ ప్రయాణంలో చాలామంది అడిగారు.. మీకు పోటీ ఎవరని? కానీ.. నాకు పోటీ ఎవరో అనేది ఇప్పుడు అర్థమైంది. మీరే (అభిమానులే) నాకు నిజమైన పోటీ. మీరు నాపై చూపించే ప్రేమ ఎక్కువ..? లేక స్క్రీన్‌పై నేను చూపించే ప్రేమ ఎక్కవ అనేది చూపిస్తా’’ అని రామ్ తన మాటలను పూర్తిచేశారు.
ఇదీ చదవండి..
‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- దిశను ఓకే చేశారా?
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని