close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 20/01/2020 09:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సత్తా చాటుతున్న ‘దర్బార్‌’

చిత్ర బృందం విడుదల చేసిన పోస్టరు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘దర్బార్‌’ ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా తమిళనాట దాదాపు 800 థియేటర్లలో విడుదలైంది. తొలి ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్‌ను సొంతం చేసుకుంటుందని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. సంక్రాంతికి ముందు ఓ సాధారణ రోజులో విడుదల కావడమే అందుకు కారణమనే టాక్‌ వినిపిస్తోంది. అందువల్లే తమిళనాట ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు 10 రోజులు పట్టిందని కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు రూ.15.8 కోట్లు రాగా, మొత్తం పది రోజుల్లో రూ.107.10 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం తమిళనాడు హక్కులను రూ.60 కోట్ల నుంచి రూ.68 కోట్ల వరకు విక్రయించినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అందువల్ల ప్రస్తుతం రాష్ట్రంలో లాభాల బాటలో ‘దర్బార్‌’ నడుస్తోందని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే చెంగల్పట్టు, చెన్నై ఏరియాలో లాభాలు మొదలయ్యాయని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. తొలి వీకెండ్‌లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లను సొంతం చేసుకున్నట్లు లైకా సంస్థ అధికారికంగా ప్రకటించడం విశేషం.


Tags :

సినిమా

రాజకీయం

  • -->

    జనరల్‌

    క్రైమ్

    స్పోర్ట్స్

    బిజినెస్‌

    జాతీయ-అంతర్జాతీయ

    జిల్లా వార్తలు
    మరిన్ని

    దేవతార్చన

    +

    © 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
    Powered By Margadarsi Computers

    Android PhonesApple Phones

    For Editorial Feedback - eMail: infonet@eenadu.net
    For Digital Marketing enquiries Contact :
    040 - 23318181 eMail :marketing@eenadu.net
    Best Viewed In Latest Browsers

    Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.