దర్శకేంద్రుడి సైకిల్‌ రైడ్ చూశారా?
close
Published : 13/07/2020 09:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దర్శకేంద్రుడి సైకిల్‌ రైడ్ చూశారా?

ప్రకృతిని ఆస్వాదిస్తున్న రాఘవేంద్రరావు

హైదరాబాద్: ఆధ్యాత్మిక చిత్రాలతో భక్తిని.. రొమాంటిక్‌ సినిమాలతో అందాల్ని ప్రేక్షకులకు రుచి చూపించే దర్శకుడు కె. రాఘవేంద్రరావు. ఎన్నో అపురూప చిత్రాలను తెరకెక్కించి దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్న రాఘవేంద్రరావు ప్రస్తుత ఖాళీ సమయాన్ని వ్యాయమాలు చేస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా సినిమా చిత్రీకరణలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖలంతా ఇంట్లోనే కుటుంబసభ్యులతో, కొత్త విషయాలు నేర్చుకుంటూ గడుపుతున్నారు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా దర్శకుడు రాఘవేంద్రరావు తన ఇంటి ప్రాంగణంలోని పచ్చికబయళ్లపై సైకిల్‌ తొక్కుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఓ వీడియోను తన ట్విటర్ ఖాతా‌లో పెట్టారు. ‘‘ప్రపంచం మనకు అందించే వాటిలో ఉత్తమమైనవి.. ప్రకృతి, ఆరోగ్యం, నమ్మదగిన స్నేహితుడు’’అని ట్వీట్‌ చేశారు. ఈ వీడియోలో రాఘవేంద్రరావు సైకిల్ నడుపుతుంటే వెనకాలే ఆయన పెంపుడు శునకం రావడం కనిపిస్తుంది. చెట్లు, పచ్చిక బయళ్ల ప్రకృతిని ఆస్వాదిస్తూ... సైకిల్‌ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. వెనకాలే వస్తున్న శునకాన్ని నమ్మదగిన స్నేహితుడిగా అభివర్ణిస్తూ మూడింటిని ఒకే వీడియోలో చూపించి మరోసారి రాఘవేంద్ర రావు తన సృజనను చాటుకున్నారు.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని