ప్రభాస్‌ సెట్‌లో అలా ఉంటారు:పూజా హెగ్డే
close
Published : 02/04/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ సెట్‌లో అలా ఉంటారు:పూజా హెగ్డే

హైదరాబాద్‌: కథానాయకుడు ప్రభాస్‌ సినిమా సెట్‌లో నిశ్శబ్దంగా ఉండరని కథానాయిక పూజా హెగ్డే చెప్పారు. వీరిద్దరు కలిసి దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూరప్‌ నేపథ్యంలో రూపొందిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇటీవల ఈ చిత్రం జార్జియా షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే ఈ చిత్రం గురించి ముచ్చటించారు. ‘లాక్‌డౌన్‌ కన్నా ముందే భారత్‌కు తిరిగి రావడం మా అదృష్టం. జార్జియాకు వెళ్లే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. కరోనా నేపథ్యంలో వీలైనంత తొందరగా భారత్‌ రావాలనే ఉద్దేశంతో షూటింగ్‌ను ముందుగానే ముగించుకున్నాం. జార్జియా నుంచి ఇంటికి రాగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయా. సెట్‌లో ప్రభాస్‌ చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. ఆయనతో కలిసి షూటింగ్‌ చాలా చక్కగా ఉంటుంది’ అని చెప్పారు.

సల్మాన్‌ ఖాన్‌ నటించబోతున్న ‘కబి ఈద్‌ కబి దివాళి’ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషించబోతున్నారు. ‘ఈ సినిమా చర్చల దశ ముగిసిన తర్వాత.. కథానాయికగా నన్ను తీసుకున్నారని సమాచారం వచ్చింది. ఆ సమయంలో ఎంతో సంతోషంగా అనిపించింది. సల్మాన్‌తో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నా’ అని బుట్టబొమ్మ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని