వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్‌? - pawan kalyan under the direction of vamsi paidipally
close
Published : 29/04/2021 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్‌?

ఇంటర్నెట్ డెస్క్: వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్ నటించిన ‘వకీల్‌ సాబ్‌’ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ మరోసారి దిల్‌రాజు నిర్మాణంలో సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. వైవిధ్యమైన చిత్రాలను తీయడంలో దిల్‌రాజు ముందుంటారు. తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఆయనకు ఓ కథను వినిపించారట. ఆ కథ బాగా నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్‌ కరోనా నుంచి కోలుకోగానే వంశీ ఈ కథను వినిపించునున్నారట. పవన్‌ ఇప్పటికే క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. మలయాళ చిత్రం ‘అయప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆ తర్వాత హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ నటిస్తారు. ఈ చిత్రాలు పూర్తికాగానే దిల్‌రాజు- వంశీ- పవన్‌ల చిత్రం లైన్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందేమో చూడాలి మరి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని