పవన్‌కి జోడీగా నిత్య - nithya menen with pawan kalyan
close
Published : 07/07/2021 19:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌కి జోడీగా నిత్య

తొలిసారి పవన్‌కల్యాణ్‌ - నిత్యమేనన్‌ జోడీ కట్టనున్నారు. ఇద్దరూ కలిసి ఈ నెల 12 నుంచి మొదలయ్యే చిత్రీకరణతో కెమెరా ముందుకు అడుగు పెడుతున్నారు. మలయాళంలో విజయవంతమైన  ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ తెలుగులో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి కథానాయకులుగా నటిస్తున్నారు. రానాకి జోడీగా ఇప్పటికే ఐశ్వర్య రాజేష్‌ని ఎంపిక చేశారు. పవన్‌ సరసన నటించే కథానాయిక ఎంపిక కోసం కొంతకాలం అన్వేషణ సాగించిన చిత్రబృందం ఆ స్థానాన్ని నిత్యమేనన్‌తో భర్తీ చేశారు. పవన్‌ - నిత్య జోడీ కట్టనున్నారనే విషయం ఇదివరకే వినిపించింది. అదే నిజమైంది. ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో మొదలయ్యే కొత్త షెడ్యూల్‌తోనే నిత్య సెట్లోకి అడుగుపెట్టనుంది. పవన్‌కల్యాణ్‌ - నిత్య తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. సాగర్‌చంద్ర దర్శకుడిగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ సంభాషణలు రాశారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని