ఇలాంటప్పుడే మన వయసు గుర్తొస్తుంది: నాని - nani receives a heart warming note from a pretty airhostess jokes it made him feel old
close
Updated : 17/03/2021 17:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలాంటప్పుడే మన వయసు గుర్తొస్తుంది: నాని

హైదరాబాద్‌: అటు క్లాస్‌ ఇటు మాస్‌ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు సహజనటుడిగా దగ్గరయ్యారు నాని. తాజాగా ఆయనకు ఒక అభిమాని ఇచ్చిన గ్రీటింగ్‌కార్డ్‌పై చేసిన సరదా కామెంట్స్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల నాని హైదరాబాద్‌ నుంచి  గోవాకు విమానంలో ప్రయాణించారు. ఆ సందర్భంలో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తున్న ఓ యువతి ఆయన్ను గుర్తించింది. వెంటనే ఒక నోట్‌ అందుకుని ఇలా రాసుకొచ్చింది ‘డియర్‌ నానిగారు, మీ చిత్రాలు చూస్తూనే నేను పెరిగాను. మీరు ఎంతో అద్భుతంగా నటిస్తారు. ఈ గ్రీటింగ్‌ మీపై నాకున్న అభిమానానికి ఒక చిన్న టోకెన్‌ లాంటిది’అంటూ ఆయన చేతిలో పెట్టింది. దీన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన నాని సరదాగా ‘ఇలాంటి ఒక అందమైన ఎయిర్‌హోస్టెస్‌ ప్రేమతో రాసి ఇచ్చిన గ్రీటింగ్‌ చూస్తుంటే అధికారికంగా నా వయసు ఎక్కువని తెలియజేస్తున్నట్టుంది’అంటూ రాసుకొచ్చారు. ఇక నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో ‘టక్‌ జగదీష్‌’ రిలీజ్‌కు సిద్ధం కాగా, ‘శ్యామ్‌ సింగ్ రాయ్‌’ కోల్‌కతాలో షూటింగ్‌ జరుపుకుంటోంది. మరోవైపు  వివేక్‌ ఆత్రేయతో ‘అంటే సుందరానికి..’చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. ఈ చిత్రంలో నానికి జోడిగా మలయాళీ భామ నజ్రియా నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని